Viral Video: ఒక్క క్షణం ఆ తల్లికి గుండె ఆగిపోయినంత పనయింది.. వరద ఈ రేంజ్లో వస్తోంటే ఆమె ఇలా చేసిందేంటి..!?
ABN , First Publish Date - 2023-07-24T15:44:38+05:30 IST
'ఏమీ కాదులే అనే ఓ చిన్నపాటి నిర్లక్ష్యం ఆ మహిళను మాత్రమే కాకుండా పాపం పసిబిడ్డను కూడా ప్రమాదంలోకి నెట్టేసింది.
ఓ చిన్న చెద పురుగు చెట్టునే కబళిస్తుంది. చిన్న నిప్పురవ్వ అడవుల్ని తగులబెడుతుంది. అలాగే ఓ చిన్న నిర్లక్ష్యం ప్రాణాలను చాలా సులువుగా బలితీసుకుంటుంది. ఓ మహిళకూ అలాంటిదే ఎదురైంది. వరద నీరు ఓ రేంజ్ లో ప్రవహిస్తోంటే పిల్లాడితో సహా ఆ వరద దాటడానికి ప్రయత్నించింది. అయితే ఆ మహిళ ఊహించిన దానికి భిన్నంగా, ఆమె నిర్లక్ష్యానికి ప్రతిఫలంగా అక్కడ పరిస్థితి చోటుచేసుకుంది. తనకెదురైన సంఘటనతో ఆమె గుండె ఒక్కసారి ఆగినంత పనైంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'అంత నిర్లక్ష్యం ఎందుకు తల్లీ..' అని ఆమెను నిందిస్తున్నారు. ఈ వీడియో గురించి పూర్తీగా తెలుసుకుంటే..
వర్షాకాలం(Monsoon) మొదలయినప్పటి నుండి పలు ప్రాంతాల్లో వర్షాలు విశ్వరూపం(heavy rains) చూపిస్తున్నాయి. వీటి కారణంగా వీధులు, రహదారులు వరదలతో జల దిగ్భంధంగా మారుతున్నాయి. వీడియోలో ఓ మహిళ తన బిడ్డను స్ట్రోలర్ లో పెట్టుకుని కనిపిస్తుంది(baby in stroller). ఆమె రోడ్డు దాటవలసి వచ్చింది. అయితే అక్కడి భారీ వర్షాల కారణంగా రహదారి మీద నీరు ప్రవహిస్తోంది(heavy floods on the road). నీటి ప్రవాహ వేగం కూడా చాలా ఉదృతంగా ఉంది. కానీ మహిళ అదేమీ పట్టించుకోకుండా ఇదేం చేస్తుందిలే అనే నిర్లక్ష్యంతో ఆ ప్రవాహాన్ని దాటడానికి బిడ్డతో సహా ముందుకెళ్లింది. ఆమె నీటి మధ్యలోకి వెళ్ళగానే నీటి వేగానికి ఆమె బిడ్డను పెట్టుకున్న స్ట్రోలర్ డ్రిఫ్టింగ్ కారణంగా అది నీళ్లలో కొట్టుకుపోవడం మొదలుపెట్టింది. ఆ స్ట్రోలర్ కొట్టుకుపోకుండా మహిళ తన బలాన్నంతా ఉపయోగించి గట్టిగా పట్టుకుంది. అయితే ఆమె బలం అందుకు సరిపోలేదు. దీంతో వెనక్కు వచ్చేయాలని స్ట్రోలర్ వెనక్కు తీసుకుంది. కానీ నీటి ప్రవాహం కారణంగా అది పక్కకు వాలింది. అప్పుడే స్ట్రోలర్ లో బిడ్డ నీటిలో నుండి కింద పడబోయింది(baby fall down from stroller). అది చూస్తుండగా ఆ మహిళ గుండె ఆగినంత పనైంది. కానీ ఆ ప్రవాహానికి ఇవతలి వైపు నిలబడుకుని ఉన్న ఓ వ్యక్తి ఇదంతా గమనించాడు. పిల్లాడికి ప్రమాదం జరగబోతోందనే విషయం గ్రహించి అతను దేవుడిలా వెంటనే ముందుకు వెళ్లి స్ట్రోలర్ నుండి కిందకు పడిపోతున్న బిడ్డను చేతుల్లో పట్టుకున్నాడు. ఇది జరగగానే ఆ తల్లి భావోద్వేగంతో ఏడుస్తూ పక్కకు వెళ్ళింది.
Wife Video: సరుకులు తీసుకునేందుకని వెళ్లి.. భార్యకు భారీ షాకిచ్చాడుగా.. భర్త ఫోన్ చేశాడని ఇంటి బయటకు వచ్చి చూస్తే..!
ఈ వీడియోను Crazy Clips అనే ట్విట్టర్(Twitter) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలువిధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 'ఏదైనా పని చేసేముందు కొంచెం ఆలోచించాలి కదా' అని ఆమె నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు. ' చివరిలో ఆమె అలా ఎందుకు పారిపోయింది?' అని మరొకరు సందేహం వ్యక్తం చేశారు. 'ఆ వ్యక్తి నిజంగా దేవుడే. కొన్ని సెకెన్లు ఆలస్యం అయినా ఆ బిడ్డ నీళ్లలో పడిపోయేవాడు' అని అంటున్నారు.