Viral Video: అమ్మా.. పెళ్లికూతురా..? విడాకులు ఎప్పుడో కూడా చెప్పెయ్.. అంటూ నెటిజన్ల సెటైర్లు.. ఇంతకీ వధువు చేసిన పనేంటంటే..
ABN , First Publish Date - 2023-04-10T16:59:32+05:30 IST
కాస్త ప్రత్యేకంగానూ.. కొత్తగానూ ఉంటుందనుకుని ఓ పెళ్ళికూతురు(bride) చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. 'నీ విడాకులెప్పుడో కూడా చెప్పేసెయ్ తల్లీ..' అంటూ..
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి(marriage) అనేది ఎంతో ప్రత్యేకం. దానికంత ప్రత్యేకత ఉంది కాబట్టే.. పెళ్ళిళ్లను అంత ఘనంగా చేస్తారు. నిశ్చితార్థం(engagement) మొదలు ప్రతి విషయంలో ఏర్పాట్లన్నీ చాలా ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటారు. కాస్త ప్రత్యేకంగానూ.. కొత్తగానూ ఉంటుందనుకుని ఓ పెళ్ళికూతురు(bride) చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. 'నీ విడాకులెప్పుడో కూడా చెప్పేసెయ్ తల్లీ..' అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఈమెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకూ ఆ పెళ్ళికూతురేం చేసింది నెటిజన్లు ఎందుకంత సెటైర్లు వేస్తున్నారు పూర్తీగా తెలుసుకుంటే..
ఓ పెళ్ళికూతురు(bride) తనకుకాబోయే భర్తకు కాస్త సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంది. ఏం చేద్దామా అని ఆలోచించగా ఆమెకు కొన్ని విషయాలు గుర్తొచ్చాయి. ఇప్పటివరకు ఎక్కడా ఏ పెళ్ళి వేడుకలో అలాంటిది చూడలేదు, వినలేదనే విషయం ఆమెకు మరింత కిక్కు ఇచ్చింది. వెంటనే తను అనుకున్నట్టు తన మెహందీ వేడుక(mehndi function)లో అబ్బాయి పేరు రాయించకుండా తను అనుకున్నది చేతిమీద రాయించుకుంది. ఆమె చేతిమీద రాయించుకున్నది చూసి బంధువులు, కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. 'ఏంటే ఇది? అబ్బాయి పేరు రాయించుకోకుండా నువ్వు చేసిన పనేంటి? నీకు పిచ్చిగానీ పట్టిందా?' అంటూ అందరూ పెళ్లికూతురు మీద విరుచుకుపడ్డారు.అయితే ఆ అమ్మాయి వాళ్ళందరికీ తన చేతిమీద రాసున్నది చూపిస్తూ.. 'నాక్కాబోయే భర్త పేరు కాకుండా ఇలా తేదీలు వేయించుకున్నానని మీరు అరుస్తున్నారా? ప్రతి తేదీ వెనుకా కారణం ఉంది' అంటూ వాళ్లకు విషయం వివరంగా చెప్పింది.
White hair: కొబ్బరి నూనెలో ఈ రెండిటినీ కలపి రాసుకోండి చాలు.. తెల్లజుట్టు నల్లగా మారిపోవడం ఖాయం..!
ఆ అమ్మాయి చేసుకోబోయేవాడు ఇన్స్టాగ్రామ్(Instagram) లో పరిచయం అయ్యాడట. వారిద్దరూ ఇన్స్టాగ్రామ్ లో పరిచయం(Instagram intro date) అయిన తేదీ, అబ్బాయి ఆమెకు ప్రపోజ్ చేసిన తేదీ(Propose date), వాళ్ళిద్దరూ మొదటిసారి కలుసుకున్న తేదీ(First meet date), ప్రస్తుతం పెళ్ళి జరగబోతున్న తేదీ(Wedding date).. ఇలా నాలుగు తేదీలను ఆమె తన చేతులమీద గోరింటాకుతో పెట్టించుకుంది. mehandi_by_anku అనే ఇన్స్టాగ్రామ్ పేజీ నుండి షేర్ చేశారు.ఆమె మెహందీ వేయించుకుంటున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా సెటైర్లు వేస్తున్నారు. 'అమ్మా పెళ్ళికూతురా.. అన్ని తేదీలు అలా వేయించుకున్నావు సరే.. ఆ విడాకుల తేదీ ఏదో దాన్ని కూడా చెప్పేసెయ్' అంటూ సెటైర్లు వేస్తున్నారు.మరికొందరు ఆమెకు వివాహ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.