Viral Video: నడిరోడ్డుపై ఓ యువతిని వేధిస్తున్న కుర్రాడు.. సడన్‌గా వచ్చి పక్కనే ఆగిన బస్సులోంచి దిగిన నలుగురు వ్యక్తులు.. చివరకు షాకింగ్ సీన్..!

ABN , First Publish Date - 2023-04-25T09:13:12+05:30 IST

నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు.. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న యువతి.

Viral Video: నడిరోడ్డుపై ఓ యువతిని వేధిస్తున్న కుర్రాడు.. సడన్‌గా వచ్చి పక్కనే ఆగిన బస్సులోంచి దిగిన నలుగురు వ్యక్తులు.. చివరకు షాకింగ్ సీన్..!

Viral Video: నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు.. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న యువతి. ఇంతలోనే వెనక నుంచి వచ్చిన ఓ పోకిరి. మాములుగానే చుట్టూ జనాలున్న కూడా వేధింపులకు పాల్పడుతున్న ఈ రోజుల్లో.. అలాంటిది ఒంటరిగా అమ్మాయి దొరికితే ఇంకేమైనా ఉందా? అమ్మాయిని నడిరోడ్డుపై వేధించడం (Molesting Girl) మొదలెట్టాడు ఆ యువకుడు. అంతలోనే అటువైపుగా ఓ బస్సు (Bus) వచ్చింది. అందులో ఉన్న కొందరు యువతిని కుర్రాడు వేధిస్తుంది గమనించారు. వెంటనే బస్సును ఆపి.. కిందకు దిగి వచ్చిన ఓ నలుగురు యువకులు ఆ పోకిరికి తగిన బుద్ది చెప్పారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియనప్పటికీ, దీని తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది (Viral Video).

సీసీటీవీ ఇడియట్స్ (@cctvidiots) అనే ట్విటర్ ఖాతా ద్వారా ఈ వీడియోను పోస్ట్ చేశారు. 'నడిరోడ్డుపై అమ్మాయిపై వేధింపులు' అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. 38 సెకండ్ల నిడివి కలిగిన ఈ ఈ వీడియోకు ఇప్పటివరకు 13.7మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 50వేలకు పైగా మంది రిట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. 'ఇలాంటి వారు ఇలాగే దెబ్బలు తింటారు', 'ఒకవేళ ఆ సమయానికి బస్సు రాకపోయి ఉంటే. తర్వాతి రోజు న్యూస్ పేపర్లలో యువతి ఫొటో వచ్చేది', 'వావ్.. ఇది ఇన్‌స్టాంట్ కర్మా. బస్సులోంచి దిగిన వారు నిజంగా చాలా మంచి పని చేశారు. పోకిరికి కరెక్ట్‌గానే రిపేర్ చేసి పెట్టారు' అని కామెంట్ చేస్తున్నారు.

Software Couple: భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే.. వివాహ బంధంపై విరక్తితో విడాకుల కోసం సుప్రీంకోర్టుకు వెళ్తే..


Updated Date - 2023-04-25T10:39:50+05:30 IST