Viral Video: పామును పట్టుకున్న ఈ కొత్త పెళ్లి కూతురి రియాక్షన్స్ చూస్తే నవ్వలేక చస్తారు.. మొదట్లో ధైర్యంగానే పట్టుకుంది కానీ..

ABN , First Publish Date - 2023-04-04T13:45:55+05:30 IST

మేకపోతు గాంభీర్యం అనే మాట చాలామంది వినే ఉంటారు. లోపల భయపడి చస్తున్నా.. బయటకు మాత్రం అస్సలు ఏమీ భయపడట్లేదనే విధంగా ప్రవర్తించేవారిని ఈ మాటతోనే పోలుస్తారు.ఈ కొత్త పెళ్ళికూతురు 'పామును పట్టుకుంటా చూడూ.. ధైర్యంగా పట్టుకుంటా చూడూ..' అని మేకపోతు గాంభీర్యంలా డాంబికాలకు పోయి చివరికి చతికిలబడింది. పామును తాడులా సిల్లీగా పట్టుకుందామని చూసిన ఈమెలో బయటపడిన రియాక్షన్స్ మామూలుగా లేవు.. ఈ మహిళకు సంబంధించి వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

పాము(Snake) అనే మాట వింటేనే గుండె వేగం(heart rate), రక్తపోటు(Blood pressure) పెరిగిపోతాయి చాలామమందికి. కళ్లతో చూడకపోయినా సరే ఆ పేరులోనే ఓ భయం(Fear) దాగుంది. కానీ కొంతమంది సాహసం చేయరా డింభకా అనే మాటతో ప్రేరణ పొంది పాములను పట్టుకోవడానికి, వాటితో ఫోటోలు దిగడానికి ప్రయత్నం చేస్తారు. అసలే కొత్తగా పెళ్ళయింది.. భర్తతో కలసి సరదాగా టూర్ కు వెళ్ళిందొక కొత్తపెళ్ళికూతురు. కంటికి కనిపించే వింతలన్నీ చూస్తూ వెళుతుండగా ఒక చోట పాములు కనబడ్డాయి. అవన్నీ పెంపుడు పాములు, ధర చెల్లించి వాటిని కాసేపు అలా పట్టుకోవచ్చు. కొత్తపెళ్ళికూతురుకు పాము చేతిలో పట్టుకుని ఫోజులు కొట్టాలని అనిపించింది. ఇంకేముంది వెంటనే రంగంలోకి దిగిపోయింది. మనసులో భయమున్నా కెమెరా ముందు ధైర్యం ప్రదర్శించి పామును చేతుల్లోకి తీసుకుంది. అప్పుడే అమ్మడిలో అసలైన కళ బయటకొచ్చింది.

ఆమె చేతిలో పాము అటూ ఇటూ కదులుతూ ఉంటే అంతలోనే నవ్వు, అంతలోనే భయం, అంతలోనే బెరుకు, అంతలోనే ధైర్యం.. ఇలా అన్ని రియాక్షన్స్ బయటపెట్టింది.@imkavy అనే ఇన్స్టాగ్రామ్ ఇన్ప్లూయెన్సర్(Instagram influencers) ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్నారు. 'నవరసాలు ఒకేసారి ఒలకబోసేస్తోంది బాబోయ్' అని చమత్కరిస్తున్నారు.

Read also: Viral News: ఇలాంటి వాళ్లే కదా జనాల గోడు వినేది.. నడిరోడ్డుపై కూర్చుని మరీ ఈ ముసలాయన చెప్పేది వింటున్న ఈమె ఎవరో తెలిస్తే..

Updated Date - 2023-04-04T13:45:55+05:30 IST