Viral Video: వామ్మో ఇదేం ఫిట్నెస్ ట్రైనింగ్.. వీళ్ల చేతుల్లో ఉన్నవేంటో తెలిస్తే అవాక్కవ్వకుండా ఉండలేరు..

ABN , First Publish Date - 2023-05-10T15:50:43+05:30 IST

ఎలాంటి జిమ్ పరికరాలు లేవు, అంతకు మించి జిమ్ సూట్ కూడా ఎవరూ వేసుకోలేదు. కానీ వారందరూ

Viral Video: వామ్మో ఇదేం ఫిట్నెస్ ట్రైనింగ్.. వీళ్ల చేతుల్లో ఉన్నవేంటో తెలిస్తే అవాక్కవ్వకుండా ఉండలేరు..

ఫిట్నెస్ కోసం ఎవరైనా ఏం చేస్తారు? జిమ్ కు వెళ్ళి వర్కౌట్లు(workouts in gym) చేస్తారు, మరికొందరు యోగా(yoga) చేస్తారు, ఇంకొందరు మంచి ఫుడ్ డైట్ మైంటైన్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం అలా లేదండోయ్.. ఎలాంటి జిమ్ పరికరాలు లేవు, అంతరు మించి జిమ్ సూట్ కూడా ఎవరూ వేసుకోలేదు. కానీ వారందరూ పొట్ట కొవ్వును చాలా సులువుగా కరిగిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫిట్నెస్ ట్రైనింగ్ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వీళ్ల తెలివి తెల్లారిపోనూ మరీ ఇంత క్రియేటివిటీనా అని బుగ్గలు నొక్కుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

రాజేంద్ర ప్రసాద్(Rajendra prasad) గారి రాంబంటు(Ram Bantu) సినిమా చూశారా? ఆ సినిమాలో రోడ్డున పడిన రాజేంద్రసాద్ తన భార్యతో కలసి ఫిట్నెస్ సెంటర్(fitness center) స్టార్ట్ చేస్తాడు. జిమ్ పరికరాలు ఏమీ లేకుండా సాగే ఆ ఫిట్నెస్ కార్యక్రమం అందరికీ ఫన్నీగా అనిపించినా బరువు తగ్గడానికి అవన్నీ సహజమార్గాలే. ఇప్పుడూ ఓ ఫిట్నెస్ సెంటర్ అదే ప్రయోగం చేసింది. మరీ పూర్తీగా అలా కాదుగానీ వీళ్ల మార్క్ చూపిస్తున్నారు. వీడియోలో ఓ ఆక్యుప్రెషర్ ట్రైనర్ ఫిట్ నెస్ క్లాస్ తీసుకున్నారు(acupressure trainer fitness class) . అందులో పొట్ట కొవ్వు తగ్గడానికి వంటగదిలో చపాతీలు వత్తడానికి ఉపయోగించే చెక్క కర్రను(wood chapathi maker)) ఉపయోగిస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ వాళ్లు చేస్తున్నది అదే.. పొట్ట కొవ్వు(belly fat) తగ్గించడానికి చపాతీ వత్తే కర్ర తీసుకుని దానితో పొట్టమీద మసాజ్ చేస్తూ ఎరోబిక్ వ్యాయామం చేసినట్టు చిందులేస్తున్నారు. ఇలా చేయడం వల్ల పొట్టభాగంలో పేరుకున్న కొవ్వు కరిగిపోతుందట.

Viral Video: పాకిస్తాన్ మరీ ఇంత దారుణంగా తయారయ్యిందేంటి? అరటి పళ్ళు అమ్ముకోడానికి ఓ చిన్న పిల్లాడు రహదారిమీదకు వస్తే ప్రజలంతా ఏం చేశారో చూడండి..


ఈ వీడియోను చిరాగ్ బర్జాత్యా Chirag Bhatya అనే ట్విట్టర్ అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. 'వామ్మో చివరికి వంటగదిలో చపాతీ కర్రను కూడా వర్కౌట్ సాధనంగా మార్చేశారా?' అని కామెంట్స్ చేస్తున్నారు. 'ఇప్పుడు చపాతీ కర్రలు చపాతీ చేయడానికంటే వర్కౌట్ చేయడానికే ఎక్కవ ఉపయోగించబడతాయేమో' అని మరికొందరు అంటున్నారు. 'ఇది చాలా ఫన్నీగా అనిపిస్తోంది, కానీ ఆ ఫిట్నెస్ ట్రైనర్ కు ఉన్న ఫ్యాన్స్ ను చూస్తే ఆశ్చర్యమేస్తుంది' అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మరొక ఫిట్నెస్ మార్గం దొరికేసింది.

ఎన్ని ప్రయత్నాలు చేసినా పెదవుల మీద నలుపు పోవట్లేదా? మీకే తెలియకుండా చేస్తున్నఈ తప్పుల వల్లే..


Updated Date - 2023-05-10T16:09:30+05:30 IST