Viral Video: 200నోటుతో మ్యాజిక్ చేసిన వృద్దుడు.. తేనె పోసి అగ్గిపుల్లతో వెలిగించాడు.. ఆ తరువాత జరిగిందేంటో చూస్తే..
ABN , First Publish Date - 2023-07-09T14:16:47+05:30 IST
మ్యాజిక్ ను పోలిన వీడియోలు ఎప్పుడూ ఆసక్తికరంగానూ, ఆశ్చర్యంగానూ ఉంటాయి.
సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో మునుపెన్నడూ చూడని షాకింగ్ సంఘటనలు తారసపడుతుంటాయి. మరీ ముఖ్యంగా మ్యాజిక్ ను పోలిన వీడియోలు ఎప్పుడూ ఆసక్తికరంగానూ, ఆశ్చర్యంగానూ ఉంటాయి. ఇప్పుడూ అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఓ వృద్దుడు 200నోటు మీద తేనె పోసి అగ్గిపుల్లతో వెలిగించాడు. ఆ తరువాత జరిగింది చూసి స్థానికులు షాకయ్యారు. ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు కూడా అవాక్కవుతున్నారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
కూటి కొరకు కోటి విద్యలు అని పెద్దలన్నారు. పేదవారు ఏ పని చేసినా వారికి ఎంతో కొంత సంపాదన రావాలని, చేతికి వచ్చే పైసలతో జీవితం అనే బండి ముందుకు లాగాలనే. ఇందులో భాగంగా ఓ వద్దుడు(old man) వినూత్న ప్రయత్నం చేశాడు. వీడియోలో కోల్‌కతాకు(Kolkata) చెందిన ఓ వృద్దుడు తేనెను(Homey) ఓ ప్లాస్టిక్ టబ్బులో పెట్టుకుని కనిపిస్తాడు. అతను రహదారి మీద కూర్చుని ఉన్నాడు. తన దగ్గరున్న తేనెను అమ్మడానికి(Honey selling) అతను ప్రయత్నిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో తేనె చాలా కల్తీగా వస్తుండటం వల్ల అతను తన తేనె నాణ్యతను తెలియజెప్పడానికి 200నోటుతో ప్రయోగం చేశాడు(Honey purity test with 200note). అతను మొదట తన వద్దనున్న 200నోటుమీద కొద్దిగా తేనె పోశాడు. ఆ తరువాత అగ్గిపుల్ల గీసి 200నోటును వెలిగించాడు. కానీ ఆ 200నోటు అంటుకోలేదు. నోటు అంటుకోలేదు కాబట్టి అది స్వచ్చమైన తేనె అని ఆ వృద్దుడు చెబుతున్నాడు. ఒకవేళ 200నోటు అంటుకుంటే అప్పుడు అది కల్తీ తేనె అవుతుందని, మొత్తం తేనెను తాను పారెయ్యడానికి సిద్దమని వృద్దుడు చెప్పాడు.
Viral Video: వామ్మో ఈ మహిళకెంత ధైర్యం.. గాల్లో ఎగురుతున్న ఒక విమానం నుండి మరో విమానం మీదకు దూకి ఈమె చేసిన పనేంటో తెలిస్తే..
ఈ వీడియోను Indian foodies అనే ఫుడ్ వ్లాగర్ తన ఫేస్ బుక్ పేజీ(Face Book page) నుండి షేర్ చేశాడు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ వృద్దుడి ట్రిక్ ను కొట్టిపడేస్తున్నారు. 'ఆ వృద్దుడి దగ్గరున్నది ఖచ్చితంగా కల్తీ తేనె, అలాంటిది తినడం మానుకోండి' అని సలహాలు ఇస్తున్నారు. 'కరెన్సీ నోట్ల మీద అయినా, కాగితాల మీద అయినా ఏదైనా ద్రవం పూసి వెలిగిస్తే ఆ కాగితం కాలిపోదు' అని సైన్స్ లాజిక్ చెబుతున్నారు. 'తేనె స్వచ్చత చెక్ చేయడానికి సరైన పద్దతి ఇది కాదు, వేరే ఉన్నాయి' అంటూ తమకు తెలిసిన పద్దతులను కామెంట్స్ లో చెబుతున్నారు.
Viral Video: ఈ చిరుత ఇంత తెలివితక్కువదేంటీ.. సులువుగా అడవి పందినైతే పట్టుకుంది కానీ.. ఆ తరువాత అది చేసిన పనికి..