Viral Video: అమ్మాయిల దుస్తులు వేసుకుంటున్నాడని తల్లిదండ్రులు ఇంట్లో నుండి గెంటేశారు.. ఇప్పుడు ఇతను ఎలా ఉన్నాడో చూడండి..
ABN , First Publish Date - 2023-03-20T13:20:01+05:30 IST
తల్లిదండ్రులతో ఛీ.. కొట్టించుకుని రోడ్డు పాలైనా ఇతను ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే..
కాంచన సినిమా చూసే ఉంటారు. అందులో ట్రాన్స్ జండర్(Transgenders) లను కుటుంబ సభ్యులే ఎలా బయటకు వెలివేస్తారో చూసి ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తరువాత సోషల్ మీడియా హవా పెరిగి ఎంతో మంది జీవితాలు ప్రజల ముందుకు వచ్చాయి. ఎంతోమంది కుర్రాళ్ళు తమలో ఉన్న స్త్రీ లక్షణాల కారణంగా అమ్మాయిల దుస్తులు వేసుకోవడం, అమ్మాయిల్లా తయారవడం చేస్తుంటారు. అలా చేసి తల్లిదండ్రుల నుండి ఛీ.. కొట్టించుకుని వీధులపాలవుతుంటారు. ఇతనూ అలాంటివాడే.. అమ్మాయిల బట్టలు వేసుకుంటున్నాడని ఇతని తల్లిదండ్రులు ఇతన్ని ఇంటినుండి బయటకు గెంటేశారు. కానీ ఇప్పుడు ఇతన్ని చూసి అందరూ షాకవుతున్నారు. ఇతని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
పురుషుల్లో మహిళల లక్షణాలు ఉండటం ఇప్పట్లో చాలానే చూస్తున్నాం. వారి జీవనశైలి గురించి పక్కన పెడితే కుటుంబ సభ్యులే వారిని చాలా దారుణంగా ట్రీట్ చేసి ఇంటినుండి బయటకు గెంటేస్తారు. శివమ్ కూడా అలాంటి అబ్బాయే.. ఇతను తన చిన్నతనంలో అమ్మాయిల బట్టలు వేసుకోవాలని ఇష్టపడేవాడు. తనకు వీలయినప్పుడల్లా అమ్మాయిల బట్టలే వేసుకునేవాడు. తల్లిదండ్రులు అతన్ని మార్చడానికి ఎంత ప్రయత్నించినా అతను తన ఇష్టాన్ని వదులుకోలేకపోయాడు. దీంతో శివమ్ ను తల్లిదండ్రులు ఇంటి నుండి గెంటేశారు. రోడ్డున పడిన శివమ్ అమ్మాయిల దుస్తులపై తనకున్న ఇష్టాన్నే తన గుర్తింపుగా క్రియేట్ చేసుకుకున్నాడు. ఆద్భుతమైన అమ్మాయిల దుస్తులు ధరిస్తూ ఫ్యాషన్ ఐకాన్ గా మారాడు. ఫ్యాషన్ వ్లాగర్ శివమ్ భరద్వాజ్(Fashion vlogger Shivam Bharadwaj) గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
తాజాగా ముంబైలో లోకల్ ట్రైన్(Mumbai Local Train) లో అమ్మాయి గెటప్(Lady getup) లో శివమ్ వీడియో చేశాడు. ఈ వీడియోలో అచ్చం అమ్మాయిలాగా క్యాట్ వాక్(Cat Walk) చేయడం చూసి తోటి ప్రయాణికులు నోళ్ళు వెళ్లబెట్టారు. ఫ్యాషన్ ప్రపంచంలో ఎదగడానికి శివమ్ చాలా కష్టపడుతున్నాడు. దానికి తగినట్టే ప్రశంసలు అందుకుంటున్నాడు. theguyi... అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్(Instagram) నుండి శివమ్ ముంబై లోకల్ ట్రైన్ లో క్యాట్ వాక్ చేసిన వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసి 'నీ ఆత్మవిశ్వాసానికి హ్యాట్సాప్' అంటున్నారు నెటిజన్లు.