Viral Video: క్లాస్‌రూమ్‌లో టేబుల్ కిందకు వంగి మరీ ప్రేయసితో ఓ విద్యార్థి ఫోన్‌కాల్.. సైలెంట్‌గా వెళ్లి పక్కనే కూర్చున్న టీచర్.. చివరకు..
ABN , First Publish Date - 2023-02-20T19:45:04+05:30 IST
కుర్రాడు ఫోన్ లో మాట్లాడుతున్న విషయం గ్రహించిన క్లాస్ టీచర్ చేసిన పనికి
కాలేజీ కుర్రాళ్ళు భలే చిలిపి పనులు చేస్తుంటారు. క్లాసులో అల్లరి చేయడం, సెటైర్లు వేయడం, క్లాసులకు బంక్ కొట్టడం ఇలాంటి కోవలోకే వస్తాయి. ఓ కుర్రాడు క్లాస్ రూమ్ లోనే తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. అతడు మాట్లాడుతున్న విషయం గ్రహించిన క్లాస్ టీచర్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో గురించి పూర్తిగా తెలుసుకుంటే..
క్లాస్ లో టీచర్ ఉండగానే ఆ కుర్రాడు తన గర్ల్ ఫ్రెండ్ కు ఫోన్ చేశాడు. తన క్లాస్ టీచర్ ఎక్కడ చూస్తాడో అనే సంశయంతో తను బుక్స్ పెట్టుకునే బల్ల కిందకు వంగి మరీ ఫోన్ మాట్లాడుతున్నాడు. అయితే పిల్లవాడి గురించి అయ్యవారికి తెలీదా.. ఆయన పసిగట్టనే పసిగట్టాడు. నెమ్మదిగా పిల్లిలా ఫోన్ మాట్లాడుతున్న కుర్రాడి దగ్గరకు వెళ్ళాడు. ఆ కుర్రాడి ఎదురుగా ఉన్న బల్లలో కూర్చున్న కుర్రాడిని పక్కకు తప్పుకోమని సైగలతోనే చెప్పాడు. కుర్రాడికి ఎదురుగా కూర్చుని తలను కుర్రాడికి దగ్గరగా పెట్టి ఆ కుర్రాడు ఏమి మాట్లాడుతున్నాడా అని వింటున్నాడు.
ఆ క్లాస్ టీచర్ ఇలా చేయగానే క్లాసులో విద్యార్థులు అందరూ గట్టిగా నవ్వడం మొదలెట్టారు. ఫోన్ మాట్లాడుతున్న కుర్రాడికి అందరి నవ్వులు వినబడి 'వీళ్ళెందుకు ఇంతగా నవ్వుతున్నారు' అనుకుని తలపైకెత్తాడు. ఎదురుగా తన క్లాస్ టీచర్ కనిపించడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఆయన ముఖంలో ముఖం పెట్టి చూస్తుండటంతో భయంతో గుటకలు వేస్తూ ఇప్పుడు నా పరిస్థితి ఏంటో అనే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అయితే ఆ క్లాస్ టీచర్ మాత్రం ఆ కుర్రాడి భయాన్ని చూసి ఒక్కసారిగా నవ్వేశాడు.
ఇదంతా వీడియా తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పిచ్చగా నవ్వుకుంటున్నారు. అలాగే ఆ క్లాస్ టీచర్ కుర్రాడి ఫోన్ కాల్ ను లైట్ గా తీసుకోవడంతో ఇలాంటి టీచర్ అందరికీ ఉండాలి అని ఒకటే మెచ్చుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ గురుశిష్యులు అందరినీ భలే నవ్వించారు.