Viral Video: వీళ్ల టెక్నాలజీ వాడకం మామూలుగా లేదుగా.. రూ.15కోట్ల కారును 30సెకెన్లలో ఎలా ఎత్తుకెళ్లారో చూస్తే..
ABN , First Publish Date - 2023-12-03T11:23:54+05:30 IST
దొంగలు మరీ స్మార్ట్ గా తయారయ్యారు. కేవలం 30 సెకెన్లలో రూ.15కోట్ల కారును ఎంత సింపుల్ గా ఎత్తుకెళ్లారో చూసే అవాక్కవుతారు.
దొంగతనాలు చాలా కామన్ అయిపోయిన కాలమిది. టెక్నాలజీ పెరిగేకొద్దీ దొంగలు కూడా స్మార్ట్ గా మారిపోయారు. బ్యాంక్ అకౌంట్ లు హ్యాక్ చేయడం, వింత స్టోరీలు అల్లడం, అధికారులమంటూ బురిడీ కొట్టించడం.. ఇలా ఒకటా రెండా చాలా మోసాలున్నాయి. ఇక దోపిడీలు, చోరీలు కూడా మామూలుగా ఏం లేవు. కానీ ఈ దొంగలు మాత్రం మరీ స్మార్ట్ అండీ బాబూ.. చక్కగా వచ్చి 15కోట్ల కారును కేవలం 30 సెకెన్లలో ఎత్తుకెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. దొంగలు కూడా ఇంత స్మార్ట్ గా తయారయ్యారేంట్రా బాబూ అని ముక్కున వేలేసుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
బ్రిటన్(Britain) లోని ఎసెక్స్ అవెలీలో హైటెక్ దొంగతనం చోటు చేసుకుంది. దొంగలు టెక్నాలజీ సహాయంతో ఖరీదైన కారును చాలా సింపుల్ గా ఎత్తుకెళ్లారు. వీడియోలో ఓ కారు, దానికి దగ్గర్లో ముసుగేసుకున్న ఓ దొంగ కనిపిస్తారు. అది రోల్స్ రాయిస్ కారు. దాని ధర అక్షరాలా రూ.15కోట్లు(15 crores rolls royce). దాన్ని దొంగతనం చేయడానికి ఇద్దరు దొంగలు ముసుగేసుకుని వచ్చారు. దొంగల చేతుల్లో యాంటిన్నాలు ఉన్నాయి. మొదటి దొంగ కారు తాళం చెవులున్న గదికి సమీపంలో ఉండగా రెండవ దొంగ కారు దగ్గరే ఉన్నాడు. రెండవ దొంగ ట్రాన్స్మీటర్ ధరించాడు. మొదటి దొంగ కారు తాళం చెవుల సిగ్నల్స్ పట్టుకుని వాటిని రెండవ దొంగకు ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ రెండవ దొంగ సిగ్నల్స్ సహాయంతో కారును స్టార్ట్ చేశాడు. కారు స్టార్ట్ అయినందుకు గుర్తుగా కారు ముందు లైట్లు కూడా వెలుగుతాయి. అనంతరం కారు ముందుకు కదులుతుంది. ఇదంతా కేవలం 30సెకెన్లలో జరగడం షాకింగ్ కు గురిచేసే అంశం. ఈ వీడియో చూస్తున్నప్పుడు వాళ్లు చేసిందేంటో అస్సలు అర్థం కాదు. కానీ యాంటెన్నా సహాయంతో వాళ్లు కారు కీ నుండి సిగ్నల్స్ పొంది వాటి సహాయంతో కారును ఎత్తుకెళ్లిపోయారు. ఇలా యాంటెన్నాలను ఉపయోగించడాన్ని రిలేయింగ్ అని అంటారట. ఇది పక్కా హైటెక్ దొంగతనమని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: రోజూ ఎర్ర అరటిపండు తింటే 9 లాభాలు..
ఈ వీడియోను Crazy Clips అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఉలిక్కిపడుతున్నారు. 'వీళ్ల టెక్నాలజీ వాడకం మామూలుగా లేదుగా..' అని ఒకరు అంటున్నారు. 'టెక్నాలజీని ఉపయోగించాల్సిన వారు కూడా ఇంత పక్కాగా ఉపయోగించరేమో వీళ్లు మామూలు దొంగలు కాదు' అని ఇంకొకరు అన్నారు. 'దొంగలు మరీ ఇంత స్మార్ట్ గా తయారయ్యారేంటి బాబోయ్'అని మరొకరు స్పదించారు. చాలామంది కారు కీస్ ను ఇంట్లో హాల్ లో లేదా టీవీ దగ్గర, ఫ్రిజ్ ల మీద ఇలా పెట్టేస్తుంటారు. అయితే కారు కీస్ ను లోపల గదుల్లో జాగ్రత్త చేయడం వల్ల ఇలాంటి దొంగతనాలకు కొంతలో కొంత అడ్డుకట్ట వేయచ్చని పోలీసులు చెబుతున్నారు.