Viral Video: ఈ డాక్టర్ నిజంగా దేవుడే.. చిన్నపిల్లాడి ఆనందం చూస్తే మీరు అదే చెబుతారు..

ABN , First Publish Date - 2023-02-26T17:35:26+05:30 IST

చిన్న పిల్లవాడికి తన జీవితంలో బోలెడంత భరోసా నింపాడు ఒక డాక్టర్.

Viral Video:  ఈ డాక్టర్ నిజంగా దేవుడే.. చిన్నపిల్లాడి ఆనందం చూస్తే మీరు అదే చెబుతారు..

కనిపించే దేవుళ్ళు డాక్టర్ లు. ఎంతో మందికి తమ చేతులతో ప్రాణాలు పోస్తారు. ఆగిపోతున్న ఊపిరి నెలబెడతారు. జీవితం మీద ఆశ కలిగిస్తారు. ఓ చిన్న పిల్లవాడికి తన జీవితంలో బోలెడంత భరోసా నింపాడు ఒక డాక్టర్. అవయవ లోపం ఉన్న చిన్న బాబుకు కృత్రిమ అవయవం సెట్ చేయడం ద్వారా డాక్టర్ నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాడు. హృదయాలను టచ్ చేసే ఈ వీడియో గురించి తెలుసుకుంటే..

ఒక్కసారి మీరు ఒంటి కాలుతో నడవడానికి ప్రయత్నించండి. అలా ఎంతో దూరం వెళ్ళలేరు. నిండా రెండేళ్ళు కూడా నిండని ఓ పిల్లాడు అదే అవయవలోపంతో బాధపడుతున్నాడు. బాబుకు కృత్రిమ కాలు అమర్చడం తప్ప వేరే అవకాశం లేకపోవడంతో బాబు తల్లి డాక్టర్లను సంప్రదించింది. డాక్టర్లు బాబుకు సరిపోయేలాగా కృత్రిమ కాలును తయారుచేశారు. కృత్రిమ కాలును చిన్నపిల్లలకు ఇష్టమైన బొమ్మకారు(Toy car)లో పెట్టుకుని బాబు దగ్గరకు తీసుకొచ్చాడు. కారులో ఉన్న కృత్రిమ కాలును(Artificial Leg) తీసుకుని బాబుకు అమర్చాడు. అంతవరకు కేవలం తల్లి ఒడిలోనూ తల్లి సపోర్ట్ తోనూ కాలం గడిపిన బాబును డాక్టర్ తన చేతులతో మెల్లిగా అడుగులు వేయించాడు. బాబు మొదట డాక్టర్ సహాయంతో నడిచినా ఆ తరువాత తనకు తాను నడుస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. డాక్టర్ తో కలసి తాను చప్పట్లు కొట్టాడు. అమాయకమైన ఆ పసిబిడ్డ ముఖంలో సంతోషం, బాబు నవ్వు చూస్తే ఎలాంటి వారైనా చలించడం ఖాయం. ట్విట్టర్(Twitter) లో GoodNewsCorrespondent అనే యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు డాక్టర్ ను ఎంతో మెచ్చుకుంటున్నారు. 'ఆ డాక్టర్ కు పిల్లలంటే ఎంత ప్రేమ ఉందో , బాబుకోసం డాక్టర్ కూడా పిల్లాడైపోయాడు చప్పట్లు కొడుతూ..' అని అంటున్నారు.

Read also: Viral Video: ఈ పోకిరి విలన్ రుచులే వేరబ్బా.. రసగుల్లాను ఇలా తినడం మీరెప్పుడూ చూసుండరు..


Updated Date - 2023-02-26T17:35:29+05:30 IST