Viral Video: ప్రతి ఒక్కరికీ ఓ అక్కో, చెల్లో ఉండాలని చెప్పేది ఇందుకే.. తమ్ముడి కోసం ఈ అక్క చేసిన సాహసం చూస్తే..

ABN , First Publish Date - 2023-07-31T13:21:43+05:30 IST

అన్నదమ్ములకు తల్లితరువాత ఆడపిల్లే తల్లి అవుతుంది. అందరి గురించి బాధ్యతగా, ప్రేమగా ఉంటుంది. అవసరమైతే ప్రాణాలకైనా తెగిస్తుంది. ఇప్పుడీ సంఘటన అదే విషయాన్ని కళ్లకు కడుతోంది.

Viral Video: ప్రతి ఒక్కరికీ ఓ అక్కో, చెల్లో ఉండాలని చెప్పేది ఇందుకే.. తమ్ముడి కోసం ఈ అక్క చేసిన సాహసం చూస్తే..

ప్రతి ఇంటికీ ఓ ఆడపిల్ల ఉండాలని అంటారు. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్లు ఇంట్లో ఉంటే ఇక ఆ ఇంట్లో గొడవలకు లోటుండదు. ఇది కేవలం నాణేనికి ఒకవైపు మాత్రమే మరొకవైపు అన్నదమ్ములకు తల్లితరువాత ఆడపిల్లే తల్లి అవుతుంది. అందరి గురించి బాధ్యతగా, ప్రేమగా ఉంటుంది. అవసరమైతే ప్రాణాలకైనా తెగిస్తుంది. ఇప్పుడీ సంఘటన అదే విషయాన్ని కళ్లకు కడుతోంది. ఇద్దరు అక్కాతమ్ముళ్ళు వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళితే ప్రమాదవశాత్తు తమ్ముడు నీటిలో కొట్టుకుపోయాడు. కానీ అతని అక్క చేసిన సాహసం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఆమె సాహసం చూసి అవాక్కవుతున్నారు. ఆమెను తెగ పొగిడేస్తున్నారు. ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

తల్లిదండ్రులు, తోబుట్టువుల పట్ల ఆడపిల్లల ప్రేమ అనిర్వచనీయమైనది. అల్లరి చేసి అలగడం లోనే కాదు, ప్రేమ, ఆప్యాయతను పంచడంలోనూ, కంటికి రెప్పలా చూసుకోవడంలోనూ ఆడపిల్లలెప్పుడూ ముందుంటారు. మరీ ముఖ్యంగా తమ్ముళ్ల మీదా, అన్నల మీద అక్కాచెల్లెళ్ళకు ఉండే ప్రేమ(sisters love) మామూలుది కాదు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా చాలాచోట్ల వాగులు పొంగి ప్రవహిస్తూ కనువిందు చేస్తున్నాయి. మరికొన్నిచోట్ల కొండమీద నుండి జలపాతాలు(water falls) కురుస్తున్నాయి. ఇద్దరు అక్కాతమ్ముళ్ళు కుటుంబంతో కలసి ఇలాంటి జలపాతాల అందం చూడటానికి వెళ్ళారు. అక్కడ కొండమీద నుండి కురుస్తున్న జలపాతాన్ని చూస్తూ మైమరచిపోయారు. నీళ్ళలో ఆడుతున్న తమ్ముడు నీళ్ళ ప్రవాహానికి కొట్టుకునిపోయాడు(brother drowned in the water). అతను నీళ్లలో కొట్టుకుని పోవడం అతని అక్క గమనించింది. ఆమె తన తమ్ముడిని ఎలాగైనా కాపాడుకోవడానికి ధైర్యం చేసి ముందుకు వెళ్లింది. ఆమె తమ్ముడు లోయ అంచు దగ్గర ఒక బండ రాయి పట్టుకుని ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆమె ఏమాత్రం భయపడకుండా లోయ అంచు దగ్గరకు వెళ్ళింది. తాను నీళ్ళలో పడిపోతే ఎలా అని ఆలోచించకుండా తన తమ్ముడిని తన రెండుకాళ్ళతో బంధించి, తన చేతులతో తమ్ముడిని గట్టిగా పొదివి పట్టుకుంది. ఎవరైనా వచ్చి తన తమ్ముడిని కాపాడమంటూ ఆమె అరవడంతో ఆమె కుటుంబ సభ్యులు, చుట్టుప్రక్కలవారు వారిని గమనించి పరిగెత్తుకొచ్చారు. వారిద్దరినీ ఆ లోయ అంచు నుండి ఇవతలికి లాక్కొచ్చారు. ఏమాత్రం జారినా వారిద్దరూ వేగంగా ప్రవహిస్తున్న లోయలోకి పడిపోయేవారే. కానీ ఆ అమ్మాయి ధైర్యమే వారిని వారిద్దరినీ కాపాడింది.

Viral Video: రైతే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి.. ట్రాక్టర్ ను ఎలా మార్చేశాడో చూస్తే ..



ఈ వీడియోను Zindagi.gulzar.ha అనే ఇన్స్టాగ్రామ్(Instagram) పేజీ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ అమ్మాయి దైర్యానికి ముగ్దులైపోతున్నారు. 'అక్క అంటే అమ్మ తరువాత అమ్మ అనేది ఇందుకే' అని ఒకరు కామెంట్ చేశారు. 'లవ్యూ సిస్టర్, ఆ సమయంలో మీరు మీ తమ్ముడిని దేవతలా కాపాడారు' అని మరొకరు కామెంట్ చేశారు. 'ప్రతి ఒక్కరికీ ఓ అక్కో, చెల్లో ఉండాలని అంటారు ఇందుకే' అని ఇంకొందరు అంటున్నారు.

Viral Video: ఇతడు కాబట్టి ఇంత ధైర్యంగా ఉన్నాడు.. వేరే ఎవరైనా అయితే గుండె ఆగి పైకి పోయేవాళ్ళే.. చెట్టుకింద కూర్చున్న వ్యక్తికి ఏం జరిగిందో చూస్తే..


Updated Date - 2023-07-31T13:21:43+05:30 IST