Viral Video: బైక్ మీద వెళ్ళే టప్పుడు వెధవ్వేషాలు వెయ్యకూడదు అనేది ఇందుకే.. యమా జోష్ గా వెళుతున్న ఈ కుర్రాళ్ళకు ఏం జరిగిందో మీరే చూడండి..
ABN , First Publish Date - 2023-05-21T16:09:07+05:30 IST
ముగ్గురు కుర్రాళ్ళు బైక్ మీద వెళుతున్నప్పుడు డ్రైవింగ్ చేస్తున్న కుర్రాడుచేసిన నిర్వాకం చూస్తే..
కుర్రాళ్ళకు బైకులంటే పిచ్చి. బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తమలో ఉన్న ట్యాలెంట్ మొత్తం బయటపెట్టాలని చూస్తుంటారు. ముగ్గురు కుర్రాళ్ళు బైక్ మీద వెళుతున్నప్పుడు డ్రైవింగ్ చేస్తున్న కుర్రాడు అలాగే చేశాడు. తనలో ఉన్న డ్రైవింగ్ స్కిల్స్ ను ప్రదర్శిస్తూ వెళుతోంటే ఊహించని సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. దీని గురించి పూర్తీ వివిరాల్లోకి వెళితే..
ఈ మధ్య కాలంలో కుర్రాళ్ళ అల్లరి హెచ్చుమీరిపోతోంది. బైక్ డ్రైవ్(bike driving) చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించకుండా ప్రమాదాలతో చెలగాటమాడతారు. చాలామంది కుర్రాళ్ళు ఇన్స్టా రీల్స్ కోసం(Insta reels), ఫేస్ బుక్ పోస్ట్స్ కోసం(face book post), యూట్యూబ్ వీడియోస్(You tube video) కోసం ఎన్నెన్నో స్టంట్లు(making stunts on bike) చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఈ స్టంట్లు వికటిస్తుంటాయి. ముగ్గురు కుర్రాళ్లు ఇలాగే స్టంట్ చేయబోయి దారుణమైన అనుభవాన్ని ఫేస్ చేశారు. వీడియోలో ముగ్గురు కుర్రాళ్ళు(three young mans) స్పెండర్ బెైక్(Splendor bike) మీద వెళుతున్నారు. వాళ్లలో డ్రైవ్ చేస్తున్న కుర్రాడు ఉన్నట్టుండి బైక్ ను లెఫ్ట్ కు రైట్ కు చాలా డౌన్ చేస్తూ తిప్పడం మొదలుపెట్టాడు. అది ఏమాత్రం స్కిడ్ అయినా బైక్ చాలాదూరం విసురుకునిపోయి పడి దారుణం జరుగుతుంది. అసలే బైక్ చాలా వేగంగా వెళుతోంది, చాలా క్రాస్ గా డ్రైవ్ చెయ్యడం వల్ల అది టర్న్ తీసుకోవడం కుదరలేదు. దీంతో డివైడర్(divider) ను ఢీ కొట్టేశారు. డివైడర్ ను ఢీ కొట్టగానే బైక్ కిందపడిపోగా కుర్రాళ్లు డివైడర్ కు అవతల పడ్డారు.
Viral News: 16ఏళ్ళ వయసులో రెస్టారెంట్లో ప్లేట్లు కడిగే ఉద్యోగం.. రెండేళ్ళ తరువాత యజమానికి దిమ్మతిరిగే షాకిచ్చిన యువతి.. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..
కుర్రాళ్ళు అవతల పడినా వారికి పెద్దగా గాయాలు కాలేదని, ఆ సమయంలో అటువైపు వాహనాలు ఏవీ రాకపోవడం వల్ల ప్రమాదం జరగలేదని స్థానికులు అన్నారు. Neha Agarwal అనే ట్విట్టర్ అకౌంట్ నుండి ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు కుర్రాళ్ళ మీద మండిపడుతున్నారు. 'ఆ బైక్ ప్లేట్ నెంబర్ చెక్ చేసిన కొందరు బైక్ గడువు తేదీ కూడా పూర్తయ్యిందని, దాన్ని నడపడమే తప్పైతే హెల్మెట్ లేకుండా, రహదారుల మీద స్టంట్లు చేయడం మరింత క్షమించరాని నేరం' అని అంటున్నారు.' డ్రైవ్ చేసేవాడు ప్రమాదంలో పడటమే కాకుండా తనతో ఇద్దరిని వెంటబెట్టుకెళ్తున్నాడు వీళ్ళకు బాగా బుద్దిచెప్పాలి' అని కామెంట్స్ చేస్తున్నారు.