Viral Video: ఇలాంటి వాళ్లను ఏం చేయాలి..? రోడ్డు దాటుతూ వ్యాన్ వస్తోందని పక్కకు తప్పుకున్న కుక్కను కావాలనే ఢీకొట్టి చంపేసిన డ్రైవర్..
ABN , First Publish Date - 2023-10-06T10:09:28+05:30 IST
తనకు ప్రమాదం జరుగుతుందని ముందే పసిగట్టి మరీ వెనక్కువెళ్లిపోతున్న కుక్కను ఆ డ్రైవర్ ఎలా చంపాడో చూస్తే రక్తం మరిగిపోతుందిి.
మనుషులు రహదారి మీద వెళుతున్నప్పుడు వాహనాల కారణంగా ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినా పెద్ద రచ్చ చేస్తారు. కానీ ఓ కుక్క పాపం తన వైపు ఎలాంటి తప్పు లేకపోయినా ప్రాణాలు పోగొట్టుకుంది. ఆ మూగజీవికే కనుక నోరు ఉండి ఉంటే బహూశా తన మీదకు వేగంగా దూసుకువస్తున్న వాహనాన్ని ఆపమంటూ ఆ వాహనంలో మనిషిని పిచ్చి తిట్లు తిట్టేదేమో. మనుషులను గుద్దితే భయపడాలి కానీ మూగజీవులను గుద్దితే ఎవరూ ఏమీ చెయ్యలేరనే ఉద్దేశంతో ఉన్నాడో లేక రాక్షస గుణం నిండుగా నింపుకుని పైశాచిక ఆనందం కోసం తిరుగుతున్నాడో కానీ ఓ వ్యక్తి దుర్మార్గానికి పాల్పడ్డాడు. వాహనం వస్తోందని రహదారి వెనక్కు వెళ్లిపోతున్న కుక్కమీదకు కావాలని వాహనం నడిపి దాని ప్రాణాలు బలితీసుకున్నాడు. ఈ వీడియో చూసిన ప్రజలు, జంతుప్రేమికుల గుండెలు రగిలిపోతున్నాయి. ఈ వీడియో గురించి పూర్తీగా తెలుసుకుంటే..
టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలలో వెళుతున్నప్పుడు రోడ్డు దాటడానికి వృద్దులు, మూగజీవులు, చిన్న పిల్లలు ప్రయత్నిస్తుంటే వాహనాలు స్లో చేసి వారికి దారి ఇచ్చేవారు ఉన్నారు. ఒకవేళ పొరపాటున వాహనాల కారణంగా రహదారుల మీద యాక్సిడెంట్ జరిగితే ఒకరిని ఒకరు తప్పుబడుతూ రచ్చ చేస్తారు. దీనికి రహదారుల మీద వెళుతున్న చాలామంది మద్దతు కూడా లభిస్తుంది. కానీ తన మానాన తాను పోతున్న ఓ కుక్క మాత్రం మనిషి పైశాచికానికి బలైంది. ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం గ్రేటర్ నోయిడాలో దారుణం చోటుచేసుకుంది. వీడియోలో రహదారి దాటడానికి ముందుకు వస్తున్న కుక్క(dog) కనిపిస్తుంది. అప్పుడే కాస్త దూరంలో స్కూల్ వ్యాన్(school van) వస్తూ కనిపించింది. దాంతో ఆ కుక్క తనకు ప్రమాదం ఉంటుందని భావించి వెనక్కు తిరిగింది. కానీ ఈలోపే ఆ వ్యాన్ డ్రైవర్ వెనక్కు వెళుతున్న కుక్క మీదకు వ్యాన్ ను దూసుకుపోనిచ్చాడు(van driver accident to dog wanted). ఆ కుక్క అక్కడికక్కడే చనిపోయినట్టు అర్థమవుతోంది. ఈ సంఘటన మొత్తం స్థానికంగా ఏర్పాటు చేసిన సిసి కెమెరాలో(CC Camera) రికార్డు అవ్వడంతో ఇది కావాలని చేసిన సంఘటన అని బయటపడింది. సిసి కెమెరా ఆధారాలు లేకపోతే అందరూ దీన్ని పొరపాటున కుక్కే వాహనానికి అడ్డుపడి మరణించిందని అనుకునేవారు.
Neeraj Chopra: జాతీయ జెండాను విసిరిన ప్రేక్షకుడు.. కింద పడిపోతుందేమోనని నీరజ్ చోప్రా చేసిన ఫీట్‌కు నెటిజన్లు ఫిదా..!
ఈ వీడియోను @GreaterNoidaW అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) యూజర్ షేర్ చేశారు. 'గ్రేటర్ నోయిడాలోని ఓమిక్రాన్-2 లో ఒక కుక్కను స్కూల్ వ్యాన్ తో ఉద్దేశపూర్వకంగా గుద్ది చంపారు. ఇలాంటి సైకోలు మీ పిల్లలను స్కూళ్లకు తీసుకెళ్తున్నారు. కుక్కలు కాపలాగా ఉంటూ ఎంతో రక్షణ కల్పిస్తాయ' అని క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియోకు నోయిడా పోలీసులను, డిసిపిని, ఉత్తరప్రదేశ్ పోలీసులను ట్యాగ్ చేసి ఆ డ్రైవర్ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు, జంతుప్రేమికులు కోపంతో రగిలిపోతున్నారు. ఆ డ్రైవర్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.'ఆ వ్యానులో కూర్చున్న వ్యక్తి అడవి జంతువు కంటే హీనమైనవాడు' అని కామెంట్ చేశారు. 'ఈ సంఘటన చూస్తోంటే మనుషుల్లో మానవత్వం చచ్చిపోయిందని అనిపిస్తోంది' అని మరొకరు కామెంట్ చేశారు.