Viral Video: గొర్రె పిల్లను ఎత్తుకెళ్లడమే ఓ తప్పు.. పైగా దగ్గరకు రావద్దంటూ తల్లికి కాలు చూపించిందో యువతి.. మరుక్షణమే షాకింగ్ సీన్..!

ABN , First Publish Date - 2023-04-09T15:26:35+05:30 IST

తన బిడ్డను తీసుకెళ్తున్నారేంటనే భయంతో గొర్రె ఆ యువతి వైపు కదిలింది. అయితే ఆ యువతి ఆ గొర్రెకు కాలు చూపించడంతో

Viral Video: గొర్రె పిల్లను ఎత్తుకెళ్లడమే ఓ తప్పు.. పైగా దగ్గరకు రావద్దంటూ తల్లికి కాలు చూపించిందో యువతి.. మరుక్షణమే షాకింగ్ సీన్..!

తల్లికి బిడ్డంటే పంచ ప్రాణాలు. బిడ్డకు ఏమైనా జరిగితే ఏ తల్లీ తట్టుకోలేదు. ఇది మనుషుల్లోనే కాదు జంతువులలో(Animals) కూడా కనిపిస్తుంది. ఆ మూగజీవులకే గనుక నోరుండి ఉంటే.. తమ బిడ్డల్ని దూరం చేస్తున్నందుకు ఎన్నెన్ని మాటలు అనేవో.. తమ కడుపుకోతను ఎలా బయటపెట్టేవో.. జంతువులలో ఉన్న మాతృత్వం(Motherhood) గురించి అక్కడక్కడా కొన్ని సంఘటనలు కనిపిస్తుంటాయి. ఇప్పుడూ అలాంటి సంఘటనొకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఓ యువతి గొర్రెల మందలో నుండి ఓ గొర్రె పిల్లను తీసుకెళ్ళబోయింది. తన బిడ్డను తీసుకెళ్తున్నారేంటనే భయంతో గొర్రె ఆ యువతి వైపు కదిలింది. అయితే ఆ యువతి ఆ గొర్రెకు కాలు చూపించడంతో అక్కడ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

పిల్లల కోడి కోపం ఏ రేంజ్ లో ఉంటుందో పల్లెటూళ్ళలో పెరిగిన ప్రతి ఒక్కరికీ తెలిసి ఉంటుంది. కేవలం కోడి మాత్రమే కాదు, పిల్లలున్న ప్రతి జంతువు చాలా అప్రమత్తంగా, కోపంగా ఉంటుంది. తన పిల్లల జోలికొస్తే ఒకో సారి వాటిని పెంచుతున్న కుటుంబ సభ్యుల మీదకే ఫైటింగ్ కు వెళతాయి. ఓ యువతి గొర్రెల మందలో(A flock of sheep) ఉన్న గొర్రె పిల్లను(Lamb) చేతుల్లోకి తీసుకుని వెళ్ళబోయింది. ఆమె వెళుతుంటే ఆ గొర్రె పిల్ల తల్లి కంగారు పడి ఆమె వెనుకే అడుగులు వేసింది. అయితే గొర్రె(Sheep) తన వెనుక వస్తుండటం చూసిన యువతి 'తంతా నావెనక వచ్చావంటే' అన్నట్టు గొర్రె వైపు తన కాలు చూపించింది. ఆమె చేష్ట గొర్రెకు అర్థమైనట్టుంది. 'వీళ్ళు నా బిడ్డను నా నుండి దూరం చేయాలని అనుకుంటున్నారు' అనే కోపంలో ఒక్కసారిగా వేగంతో వెళ్ళి ఆ యువతిని తన తలతో గుద్దింది. గొర్రె గుద్దిన ఒక్కదెబ్బకే ఆ యువతి ఒక్కసారిగా మొదలు నరికిన చెట్టులా కిందకు పడిపోయింది. ఆమె రొప్పుతూ పైకి లేవగానే గొర్రె మళ్ళీ ఇంకొక దెబ్బ వేద్దామని ముందుకు వెళ్ళబోయింది.

Wife: వీడేం భర్తండీ బాబూ.. వాషింగ్ మెషీన్‌లో వేసే ముందు ప్యాంట్ జేబుల్లో ఏమైనా ఉన్నాయా..? అని భార్య వెతుకుతోందని తెలిసి..


ఊహించని ఈ పరిణామానికి ఆ మహిళతో పాటు అక్కడున్న వారు అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. When Animals Attack అనే ట్విట్టర్ అకౌంట్ నుండి ఈ వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. don't take a baby from it's mother అనే క్యాప్షన్ ఈ వీడియోకు జతచేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు గొర్రె మంచి పని చేసిందని అభినందిస్తున్నారు. 'తన పిల్లల జోలికొస్తే ఏ తల్లీ ఊరికే ఉండదు.ఎంతకు తెగించడానికి అయినా వెనుకాడదు, అది మనుషులు అయినా, జంతువులు అయినా ఇంతే' అని అంటున్నారు. 'ఆ మహిళ ప్రవర్తన చాలా తప్పు. గొర్రె పిల్లను తీసుకెళ్ళాలని అనుకుంది సరే.. తల్లి గొర్రెకు కాలు చూపించడం ఎంత వరకు కరెక్ట్' అని మరికొందరు కామెంట్ చేశారు. 'ఏ జంతువు నుండి అయినా వాటి పిల్లల్ని దూరం చేయద్దు' అని అంటున్నారు అందరూ.

Nikhil Kamath: ఒకప్పుడు రూ.8 వేల జీతం.. నేడు 9 వేల కోట్లకు అధిపతి.. 35 ఏళ్ల వయసుకే ఇన్ని కోట్లు ఎలా సంపాదించాడంటే..!


Updated Date - 2023-04-09T15:26:35+05:30 IST