Viral Video: వామ్మో ఈ మహిళకెంత ధైర్యం.. గాల్లో ఎగురుతున్న ఒక విమానం నుండి మరో విమానం మీదకు దూకి ఈమె చేసిన పనేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-07-09T10:27:30+05:30 IST

కొంతమంది మహిళల ధైర్యం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఈ మహిళ చేసిన పని చూసి నెటిజన్లు షాకవుతున్నారు..

Viral Video:  వామ్మో ఈ మహిళకెంత ధైర్యం.. గాల్లో ఎగురుతున్న  ఒక విమానం నుండి మరో విమానం మీదకు  దూకి ఈమె చేసిన పనేంటో తెలిస్తే..

మహిళలు తలచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. మగవారు కూడా భయపడే పనులను చాలా అలవోకగా చేసేస్తుంటారు. ఇలాంటి మహిళలను సూపర్ ఉమెన్స్ అని చెప్పవచ్చు. ఇలాంటి సూపర్ ఉమెన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళ గాల్లో ఎగురుతున్న ఒక విమానం నుండి మరొక విమానం మీదకు దూకి చేసిన పని ఏంటో తెలిస్తే నోరెళ్ళబెట్టడం ఖాయం. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ప్రమాదాలు, సమస్యలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఉండటం, సమయస్పూర్తి ప్రదర్శించడం చాలా కొద్దిమందిలో మాత్రమే ఉండే గుణం. కానీ రైల్వేస్(Railways), నేవీ(Navy), పోలీస్(Police), ఫారెస్ట్(forest) వంటి రంగాలలో పనిచేసేవారికి ఈ లక్షణాలు తప్పనిసరిగా ఉండాల్సిందే.ఆడ, మగ ఎవరైనా సరే ఇందుకు మినహాయింపు కాదు. అయితే ఎంత ధైర్యవంతులైనా మరీ గాల్లో ఎగురుతున్న ఒక విమానం నుండి మరొక విమానం మీదకు జంప్ చేయడమంటే కాస్త ఆలోచిస్తారు. కానీ ఈ మహిళ మాత్రం ధైర్యం(brave women) ప్రదర్శించి చరిత్రలో తన సాహసాన్ని సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. విషయంలోకి వెళితే.. ఓ విమానం గాల్లో ఎగురుతుండగా దాని ల్యాండింగ్ గేర్ ఊడిపోయి జారిపోయింది(gear landing blowing away). దీంతో ఆ విమానం ల్యాండ్ కావడం కుదరలేదు. చాలాసేపు ఆకాశంలో చక్కర్లు కొడుతూనే ఉండిపోయింది. విమానంలో పైలట్ సమస్యను అధికారులకు విన్నవించాడు. దీంతో అధికారులు హుటాహుటిన ఆ విమానంకు ల్యాండింగ్ గేర్ ను సెట్ చేయించడానికి కసరత్తులు మొదలుపెట్టారు.ఈ ఆపరేషన్ కోసం ఓ మహిళను ఎంచుకున్నారు. వీడియోలో ఓ మహిళ వీపుకు ల్యాండింగ్ టైర్(Women tie landing tyre in her back) కట్టడం చూడచ్చు. ఆ మహిళ ఏమాత్రం భయం లేకుండా ల్యాండింగ్ టైర్ కట్టుకుని విమానం ఎక్కుతుంది. ఆ విమానం గాల్లో ఎగురుతూ.. ఆకాశంలో ల్యాండింగ్ టైర్ కోల్పోయిన విమానాన్ని చేరుకుంటుంది. మహిళ ఉన్న విమానం టైర్ కోల్పోయిన విమానం దగ్గరగా వెళ్ళగానే చాకచక్యంగా విమానం రెక్కమీదకు ఎక్కుతుంది. ఆ తరువాత ఆమె తను ఉన్న విమానం నుండి పక్క విమానం మీదకు దూకుతుంది(Women jump into onther plane from flying plane). తరువాత ఆమె ల్యాండింగ్ గేర్ విభాగానికి వెళ్ళి అక్కడ టైర్ ను విజయవంతంగా సెట్ చేస్తుంది. ఈ సంఘటన 1926 సంవత్సరంలో జరగింది(1926's incident) కావడం అందరినీ ఆశ్చర్యపరిచే విషయం. 'ఆ కాలానికే మహిళలు ఇంత ధైర్యం ప్రదర్ళించారా?' అని ఈ వీడియో చూసిన ప్రజలు అవాక్కవుతున్నారు.

Drinking Water: రోజూ పరగడపున నీళ్లు తాగితే మంచిదేనంటూ.. అందరూ చేస్తున్న బిగ్ మిస్టేక్ ఇదే.. ఆయుర్వేదంలో ఏముందంటే..!


ఈ వీడియోను Tarihi Merak Ediyoruz అనే ట్విట్టర్ అకౌంట్ నుండి షేర్ చేశారు. 1926లో ల్యాండింగ్ టైర్ ను మారుస్తున్న ధైర్యవంతమైన మహిళ అని క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 'ఆమె చాలా ధైర్యవంతురాలు' అని ఆమె మీద ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. 'ఆమె అప్పటి సాహసం నేటి మహిళలకు కూడా స్పూర్తినిస్తుంది' అని అంటున్నారు.

Success Story: 8 ఏళ్లపాటు బ్యాంకు ఉద్యోగం చేసి విసుగొచ్చి రిజైన్ చేశాడు.. ఇప్పుడు రూ.21 కోట్ల వ్యాపారానికి యజమాని..!


Updated Date - 2023-07-09T10:27:30+05:30 IST