Viral Video: అపార్ట్మెంట్ అంచున నిలబడి దూకేందుకు సిద్ధమైన మహిళ.. కేవలం 30 సెకన్లలోనే ఊహించని సీన్..!

ABN , First Publish Date - 2023-06-20T10:44:28+05:30 IST

ఓ మహిళకు ఏ కష్టమొచ్చిందో.. ఆమె ఎంత బాధపడిందో తెలియదు కానీ ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. తన అపార్మెంట్ అంచున నిలబడి దూకడానికి సిద్దమైంది. దూకద్దని ఎవరెంత మొత్తుకున్నా ఆమె కాంప్రమైజ్ కాలేదు.

Viral Video: అపార్ట్మెంట్ అంచున నిలబడి దూకేందుకు సిద్ధమైన మహిళ.. కేవలం 30 సెకన్లలోనే ఊహించని సీన్..!

ఒకచిన్న తొందరపాటు చాలా తప్పులు చేయిస్తుంది. కోపం, ఆవేశం, బాధ ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని చెబుతూ ఉంటారు. చాలా వరకు ఆత్మహత్యలు ఇలాంటి ఎమోషన్స్ లో ఉన్నప్పుడే జరుగుతుంటాయి. ఓ మహిళకు ఏ కష్టమొచ్చిందో.. ఆమె ఎంత బాధపడిందో తెలియదు కానీ ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. తన అపార్మెంట్ అంచున నిలబడి దూకడానికి సిద్దమైంది. దూకద్దని ఎవరెంత మొత్తుకున్నా ఆమె కాంప్రమైజ్ కాలేదు. అప్పుడే ఊహించని సంఘటన చోటుచేసుకుంది. కేవలం 30సెకెన్లలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియా గురించి పూర్తీగా తెలుసుకుంటే..

ఆత్మహత్య మహాపాపం అని పెద్దలు ఏనాడో చెప్పారు. కానీ నేటికాలంలో ఆత్మహత్యలు( suicide)ఎక్కువగా నమోదు అవుతున్నాయి. వేగవంతమైన ప్రపంచంలో పక్కవాడి బాధను పంచుకునేవాడు, వినేవాడు లేకపోవడంవల్ల మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు(peoples got depression). ఆ ఒత్తిడిలోనే ఇక ఈ జీవితం చాలని అనుకుంటున్నవారు చాలామంది ఉంటున్నారు. వీడియోలో ఓ మహిళ తన అపార్మెంట్ అంచున నిలబడి(women standing in apartment edge) పై నుండి కిందకు దూకడానికి సిద్దమైంది. ఆమెకు ఏ కష్టమొచ్చిందో, మరే ఇబ్బందులు ఉన్నాయో తెలీదు కానీ ఆమె తనకు చావే పరిష్కారం అనుకుంది. తన అపార్మంట్ నుండి దూకి చనిపోవడం సులువనే ఆలోచనతో అపార్మెంట్ అంచున నిలబడుకుని దూకడానికి ప్రయత్నిస్తోంది(women try to jump from apartment). ఆమె ఆత్మహత్యకు ప్రయత్నిస్తోందని ఆ బిల్డింగ్ లో నివసించేవారు గమనించారు. దూకద్దంటూ ఆమెకు ఎన్నో విధాలుగా నచ్చజెప్పారు. కానీ ఆ మహిళ ఎవరిమాటా వినలేదు. ఆమె దూకడానికే ఫిక్సయిపోయింది. అక్కడున్నవారిలో ఒకరు రెస్క్యూ టీమ్(rescue team) కు కాల్ చేసి మహిళ ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న విషయం చెప్పారు. ఆ మాట వినగానే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చాలా వేగంగా చేరుకున్నారు. ఆ మహిళ నిలబడుకున్న అపార్ట్మెంట్ పైకి వెళ్ళి ఆమెను కాపాడటానికి వారి ప్రాణాలను పణంగా పెట్టారు. రెస్క్యూ సిబ్బంది మొదట మహిళ కిందకు దూకకుండా వలను ఆమెకు అడ్డంగా విసిరారు. ఆ మహిళ ఆ వలను తొలగించి కిందకు దూకడానికి ప్రయత్నిస్తోంటే తాళ్ళ సహాయంతో పై నుండి మహిళ ముందుకు మెరుపులా దుసుకువచ్చారు. ఆ మహిళ కిందకు దూకకుండా అడ్డుకుని ఆమె ప్రాణాలు కాపాడారు. వారు మహిళను కాపాడగానే ఆ బిల్డింగ్ లో నివసిస్తున్నవారందరూ చప్పట్లతో రెస్క్యూ సిబ్బందిని అభినందించారు.

Viral Video: ట్రైన్లో ప్రయాణిస్తున్న కుర్రాడికి షాకింగ్ అనుభవం.. రాత్రి 2గంటల సమయంలో టాయిలెట్ కు వెళ్ళడానికి అతను పడిన అవస్థలు చూస్తే..


ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ మనదేశంలో మాత్రం కాదని కచ్చితంగా చెప్పవచ్చు. ఈ వీడియోను Next Level Skills అనే ట్విట్టర్ అకౌంట్ నుండి షేర్ చేశారు. 'మనల్ని కాపాడటానికి వారు వారి ప్రాణాలను రిస్క్ లో పెడతారు' అనే క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రెస్క్యూ సిబ్బంది మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. 'ఆ రెస్క్యూ సిబ్బంది మహిళకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు' అని అంటున్నారు. 'అదంతా ఓకే.. ఇప్పుడు ఆ మహిళను ఆత్మహత్య కు ప్రయత్నించిన కారణంగా అరెస్ట్ చేస్తారు' అని ఇంకొకరు ఆ తరువాత జరిగే విషయాన్ని చెప్పుకొచ్చారు. 'టీమ్ వర్క్ ఇలానే ఉంటుంది' అని మరికొందరు రెస్క్యూ సిబ్బందిని మెచ్చుకుంటున్నారు.

Viral Video: మనుషుల్లో దేవుడంటే నువ్వే భయ్యా.. ఎర్రటి ఎండలో ఓ వృద్దుడు రిక్షా లాగుతోంటే చూడలేక ఈ ఆటోవాలా ఏం చేశాడంటే..


Updated Date - 2023-06-20T10:44:28+05:30 IST