Viral Video: సింహంతో సెల్ఫీ అంత ఈజీ కాదమ్మాయ్.. స్మార్ట్ ఫోన్ తీసుకుని ఫొటో క్లిక్మనిపించే లోపే షాకింగ్ ట్విస్ట్..!
ABN , First Publish Date - 2023-04-12T20:36:25+05:30 IST
అమ్మాయి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. సింహంతో సెల్పీ lతీసుకుంటుండగా ఒక్కసారిగా..
మృగరాజంటే ఎవరికి మాత్రం ఆసక్తి ఉండదు? సింహాన్ని చూడటమే ఒకి థ్రిల్. అలాంటిది దాంతో ఓ ఫోటో తీసుకునే ఛాన్స్ వస్తే ఊరికే ఉంటారా ? చక్కగా ఫోటోలు దిగి అందరికీ చూపించి గొప్పగా చెప్పుకోడానికి వెంటనే ఆపరేషన్లోకి దిగిపోతారు. ఓ అమ్మాయి కూడా అదేవిధంగా సింహంతో సెల్ఫీ తీసుకోవాలని అనుకుంది. అందుకోసం స్మార్ట్ ఫోన్ బయటకు తీసి ఫోటో తీసుకునేలోపు షాకింగ్ ట్విస్ట్ తగిలిందామెకు. అమ్మాయి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. సింహంతో సెల్పీ అంత ఈజీ కాదు అంటున్నారు నెటిజన్లు. ఇంతకీ సెల్ఫీ తీసుకుంటున్నప్పుడు జరిగిందేంటో తెలుసుకుంటే..
మృగరాజు రేంజే వేరు. ఎంతైనా కింగు కదా.. జంతువుల దగ్గరనుండి మనుషుల వరకు ఆ మాత్రం అటెన్షన్ ఉంటుంది. ఓ అమ్మాయి జూకు(Zoo) వెళ్ళింది. జంతువులను చూసుకుంటూ సింహం(Lion) దగ్గరకు వెళ్ళింది. సింహాన్ని చూడగానే దాంతో సెల్ఫీ(selfie) తీసుకోవాలనే కోరిక పుట్టింది. ఇంకేముంది చేతిలో ఎలాగో స్మార్ట్ ఫోన్(smart phone) ఉంది కదా అని దాన్ని బయటకు తీసి సెల్పీ తీసుకోబోయింది. అయితే సింహం ఉన్న బోను(lion cage) పక్కనే ఇంకొక బోనులో ఓ ఎలుగుబంటి(bear cage) కూడా ఉంది. ఆ ఎలుగుబంటి గ్రిల్స్ లో నుండి పంజా బయటకు పెట్టి ఆ అమ్మాయి టీ షర్ట్ పట్టుకుని లాగింది. సింహంతో సెల్ఫీ తీసుకోవాలనే సంబంరంలో ఆ అమ్మాయి ఉండగా అలా జరిగేసరికి ఒక్కసారిగా షాకయ్యింది, భయంతో కేకలు వేసింది. ఎలుగుబంటి నుండి తన టీ షర్ట్ విడిపించుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఎలుగుబంటి మాత్రం అంత ఈజీగా ఆమె టీ షర్ట్ ను వదల్లేదు. ఈలోపే అక్కడున్న ఓ వ్యక్తి ముందుకు వచ్చి ఎలుగుబంటి చేతుల్లో నుండి ఆ అమ్మాయి టీ షర్ట్ విడిపించాడు.
Viral Video: కంటతడి పెట్టిస్తున్న వీడియో.. నెల రోజుల తర్వాత కనిపించిన ఆరిఫ్.. జూలో ఉన్న కొంగ రియాక్షన్ ఇదీ..!
ఈ వీడియోను_hasret_kokulun_ అనే ఇన్స్టాగ్రామ్(Instagram) పేజీ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. 'జంతువులతో వీడియో తీసుకోవాలనే మూర్ఖత్వంలో చాలా మంది ప్రమాదంలో పడుతున్నారు' అని కొందరు కామెంట్స్ చేశారు. 'ఆ ఎలుగుబంటి దాని పంజాతో ఆ అమ్మాయి టీ షర్ట్ మాత్రమే పట్టుకుంది కాబట్టి సరిపోయింది, అదే గోళ్ళతో రక్కి ఉంటే ఎంత ప్రమాదం' అని మరికొందరు కామెంట్స్ చేశారు. అయితే ఈ వీడియోను సరదాగా తీసుకున్నవారు మాత్రం సరదాగా కామెంట్స్ చేశారు. 'సింహంతో సెల్పీ తీసుకుంటే ఎలాగ? నాతో కూడా తీసుకో అని ఎలుగుబంటి అడుగుతోంది' అని కొందరు చమత్కారం చేశారు. 'సింహంతో సెల్ఫీ తీసుకోవాలంటే అంత ఈజీ కాదమ్మా.. ఇక్కడ పర్మిషన్ తీసుకో' అని ఎలుగుబంటి చెబుతోందని మరికొందరు అన్నారు. కానీ జంతువుల దగ్గర జాగ్రత్తగా ఉండాలన్నదే ప్రతి ఒక్కరూ చెబుతున్న విషయం.