Share News

Viral Video: వావ్ ఏం టెక్నిక్ బాస్.. చేతులు నొప్పులు రాకుండా గోధుమలను ఎలా శుభ్రం చేస్తున్నారో చూస్తే..

ABN , First Publish Date - 2023-10-24T12:48:26+05:30 IST

గోధుమలు శుభ్రం చేయడానికి ఓ వ్యక్తి చేసిన ప్రయోగం, అతని ఆవిష్కరణ చూశారంటే షాకవుతారు.

Viral Video:  వావ్ ఏం టెక్నిక్ బాస్.. చేతులు నొప్పులు రాకుండా గోధుమలను ఎలా శుభ్రం చేస్తున్నారో చూస్తే..

అవసరం అన్నీ నేర్పిస్తుంది అని అంటారు. కేవలం నేర్పించడమే కాదు అవసరం కొత్త ఆవిష్కరణలు కూడా చేయిస్తుంది. ఈ మధ్యకాలంలో చాలామంది అవసరాన్ని బట్టి కొత్త కొత్త వస్తువులు కనుగొంటున్నారు. తమకు అందుబాటులో ఉన్న వస్తువులతో అద్భుతం చేస్తున్నారు. ఫలితంగా కష్టపడి చేయాల్సిన పని చాలా సులువుగా పూర్తవుతుంది. వాటికి సంబధించి చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. గోధుమలు శుభ్రం చేయడానికి ఓ వ్యక్తి చేసిన ప్రయోగం, అతని ఆవిష్కరణ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చేతులు నొప్పి పుట్టకుండా ఎన్ని గోధుమలను అయినా చక్కగా శుభ్రం చేసే ఈ టెక్నిక్ నిజంగా భలే ఉంది. ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివిరాల్లోకి వెళితే..

గోధుమలు(Wheat grains) ఆరోగ్యానికి చాలా మంచివి. చాలామంది ఆరోగ్య స్పహతో బయటపిండి కొనకుండా గోధుమలు తెచ్చుకుని వాటిని శుభ్రపరిచి, మరపట్టించి పిండి వాడుకుంటారు. అయితే గోధుమలు, రాగులు, జొన్నలు వంటి తృణధాన్యాలను శుభ్రం చేయడం కొంచెం కష్టంతో కూడుకున్నది. వెదురు జల్లెడలో వేసి తిప్పడం, ఆ తరువాత తూరుపు పట్టడం ద్వారా ధాన్యాలు శుభ్రం చేస్తుంటారు. పల్లె ప్రాంతాలలో పెద్ద మొత్తంలో ధాన్యం శుభ్రం చేయడానికి గాలికి వ్యతిరేక దిశలో ధాన్యాన్నిఎత్తునుండి పోస్తారు. దీన్ని తూర్పు పట్టడం అంటారు. సరిగ్గా అదే పద్దతిని వినూత్నంగా ఉపయోగించారు. వీడియోలో ఒక పొడవాటి ప్లాస్టిక్ టేబుల్(long plastic table) ఉంది. ఆ టెబుల్ ఉపరితల భాగానికి కొంచెం కింద నాలుగు వైపులా నాలుగు చిన్న రంధ్రాలు ఉన్నాయి. ఈ నాలుగు రంధ్రాలలో మూడింటిని ప్లాస్టర్ తో క్లోజ్ చేశారు. మిగిలిన ఒక రంధ్రాన్ని అలాగే ఉంచేశారు. ఒక కూలర్(Cooler) పైన ప్లాస్టిక్ టేబుల్ ను తిప్పేసి ఓపెన్ రంధ్రం ముందు ఉండేలా పెట్టారు. టేబుల్ లో గోధుమలు పోయగానే అవి ముందు రంధ్రంలో నుండి మెల్లగా కిందకు పడుతున్నాయి. ఈ ప్రాసెస్ లో కూలర్ గాలికి గోధుమలలో ఉన్న దుమ్ము, ధూళి దూరంగా ఎగిరిపోతున్నాయి(Wheat grains cleaning technique). దీని సహాయంతో గోధుమలు మాత్రమే కాకుండా చాలా రకాల ధాన్యాలు ఇలాగే శుభ్రం చేసుకోవచ్చు.

Read also: Viral Video: రోడ్డు పక్కన టీ అమ్ముతున్న రజనీకాంత్.. ఇదేమైనా కొత్త సినిమా షూటింగేమో అనుకున్నారంతా.. కానీ అసలు సంగతి తెలిసి..


ఈ వీడియోను fun_reels_wale అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇంప్రెస్ అవుతున్నారు. 'ఆడవారికి ఈ టెక్నిక్ చాలా ఉపయోగకరం' అని ఒకరు కామెంట్ చేశారు. 'కూలర్ ను ఇలా కూడా ఉపయోగించవచ్చని ఇప్పుడే అర్థమయ్యింది' అని మరొకరు కామెంట్ చేశారు. 'కూలర్ స్థానంలో టేబుల్ ఫ్యాన్ కూడా ఉపయోగించవచ్చని అనిపిస్తోంది' అని ఇంకొకరు కామెంట్ చేశారు.

Read also: White Hair: తెల్లజుట్టు కవర్ చేయడానికి పదే పదే హెన్నా పెట్టినా పెద్దగా ఫలితం లేదా? ఒక్కసారి హెన్నాలో ఇది కలిపి వాడితే..


Updated Date - 2023-10-24T12:48:26+05:30 IST