Viral Video: మొబైల్ మాయలో పడిన ఓ తల్లి చేసిన నిర్వాకం.. జరిగిందేంటో తెలిస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు..
ABN , First Publish Date - 2023-06-11T13:05:59+05:30 IST
గృహిణులు ఇంటి పనులు వంట పనులు చేసుకుంటూ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్, రీల్స్. షార్ట్స్ ఫాలో అవుతుంటారు. మొబైల్ కు అడిక్ట్ అయినవారు చేసే పనులు చూస్తే కొన్ని సార్లు చాలా నవ్వు వస్తుంది. ఓ మహిళ నెట్ బ్రౌజింగ్ లో మునిగిపోయి..
ఇప్పటికాలంలో ప్రతి ఒక్కరి దగ్గరా మొబైల్ ఉంటుంది. ముఖ్యంగా గృహిణులు ఇంటి పనులు వంట పనులు చేసుకుంటూ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్, రీల్స్. షార్ట్స్ ఫాలో అవుతుంటారు. మొబైల్ కు అడిక్ట్ అయినవారు చేసే పనులు చూస్తే కొన్ని సార్లు చాలా నవ్వు వస్తుంది. ఓ మహిళ నెట్ బ్రౌజింగ్ లో మునిగిపోయి చేసిన నిర్వాకం చూస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'అయ్యో తల్లీ.. మరీ అలా ఉన్నావేంటి' అని అంటున్నారు. దీని గురించి పూర్తీ వివరాలు తెలుసుకుంటే..
మొబైల్ ఫోన్(mobile phone) మనుషుల జీవితాల్లో భాగం అయిన మాట అటుంచితే మనుషుల జీవితాలను లాగేసుకుందని అనడం కరెక్ట్. నెట్ బ్రౌజింగ్ చేస్తూ గంటలు గంటలు సునాయాసంగా కోల్పోతుంటారు. వీడియోలో మొబైల్ ఫోన్ కు అడిక్ట్ అయిన ఓ మహిళ(mobile phone addicted women) హాల్ లో సోఫా మీద కూర్చుని ఉంది. ఆమె ఎదురుగా బేబీ వాకర్ ఉంది. ఆమె మొబైల్ బ్రౌజర్ చేస్తూ బేబీ వాకర్(women move baby walker) ను తన కాలుతో అటూ ఇటూ ఊపుతోంది.అదే గదిలో ఆమె పెద్ద కూతురు ఆడుకుంటోంది. కొద్దిసేపటి తరువాత ఆమె మొబైల్ చూడటం ఆపి బేబీ వాకర్ వైపు చూసింది. బేబీ వాకర్ లో తన బిడ్డ కనిపించకపోవడంతో ఆమె కంగారు పడింది. వెంటనే కూర్చున్నచోటు నుండి లేచి బిడ్డ కోసం వెతకడం మొదలుపెట్టింది. బిడ్డ పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళాడేమో అని గదిలోకి తొంగి చూసింది. అక్కడ పిల్లాడు లేకపోవడంతో మరింత కంగారుగా వెనుదిరిగి వస్తుండగా ఆమె చంకలోకి చూసుకుని ఒక్కసారిగా షాకైంది. ఏ పిల్లాడైతే కనిపించడం లేదని ఆమె కంగారు పడుతూ వెతుకులాట మొదలుపెట్టిందో, అదే పిల్లాడు ఆమె చంకలో నిక్షేపంగా ఉన్నాడు. అది చూసుకుని ఆ మహిళ ఒక్కసారిగా నిట్టూర్చి ఆ తరువాత పిల్లాడిని ముద్దుచేస్తుంది. ఇదంతా హాల్ లో సెట్ చేసిన సిసి కెమెరాలో(CC Camera) రికార్డ్ అయింది.
Viral video: ఓ రైతుకు ఇంతకన్నా ఏమి కావాలి.. పొలంలో నిరాశగా కూర్చుని ఉన్న రైతునుచూసి పెంపుడు జంతువులు ఏమి చేశాయంటే..
ఈ వీడియోను Figen అనే ట్విట్టర్(Twitter) అకౌంట్ నుండి షేర్ చేశారు. దేవుడా నా బిడ్డ ఎక్కడున్నాడు అనే క్యాప్షన్ ఈ వీడియోకు జోడించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్నారు. 'మేకపిల్లను చంకనేసుకుని ఊరంతా తిరిగినట్టుంది ఈమె వాలకం' అని అంటున్నారు. 'మొబైల్ కు అడిక్డ్ అయితే ఇలాగే ఉంటుంది' అని మరికొందరు అంటున్నారు. 'దీన్నే మొబైల్ వాడకం వల్ల వచ్చే మతిమరుపు అంటారు' అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మొబైల్ వాడుతున్నప్పుడు తమకు ఎదురైన అనుభవాల గురించి చెప్పుకొచ్చారు.