Viral Video: ఏం పనులమ్మా ఇవీ.. నడిరోడ్డుపై ఈ నిర్వాకాలేంటి..? వీడియోను చూస్తోంటేనే గుండె ఆగిపోయేట్టుందిగా..!
ABN , First Publish Date - 2023-07-12T15:37:57+05:30 IST
ప్రతి మనిషికి వేపకాయంత వెర్రి ఉంటుంది అంటారు కానీ, ఈ మహిళకు వెర్రి గుమ్మడికాయంత ఉన్నట్టుంది. నడిరోడ్డుమీద, రాత్రి సమయంలో బైక్ పై ..
ప్రతి మనిషికి వేపకాయంత వెర్రి ఉంటుంది అంటారు కానీ, ఈ మహిళకు వెర్రి గుమ్మడికాయంత ఉన్నట్టుంది. నడిరోడ్డుమీద, రాత్రి సమయంలో బైక్ పై ఈమె చేసిన పనికి ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. బైక్ డ్రైవింగ్ ఫర్ఫెక్ట్ గా వచ్చేవారు అయినా సరే.. ఈమె డ్రైవింగ్ చూస్తే ఒక్కసారిగా ఊపిరితీసుకోవడం మరచిపోతారు. బైక్ డ్రైవింగ్ అంట్ భయపడేవారికైతే చెమటలు పట్టడం ఖాయం. ప్రస్తుతం ఈ మహిళకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
రాను రాను మహిళల పిచ్చి పీక్స్ లోకి వెళుతోంది. అబ్బాయిలకు తాము తక్కువేం కాదని నిరూపించే క్రమంలో అమ్మాయిలు సాహసాలు చేస్తారు. అయితే ఈ సాహసాలు కొన్ని సంభ్రమం కలిగిస్తే మరికొన్ని 'అమ్మబాబోయ్.. అవసరమా ఇలాంటివి?' అని విస్తుపోయేలా చేస్తాయి. ఓ మహిళ సాహసం ఇప్పుడు ఈ రెండూ ఒకేసారి అనేలా చేస్తోంది. వీడియోలో ఓ అమ్మాయి బైక్ డ్రైవ్(Women bike drive) చేస్తూ కనిపిస్తుంది. అయితే ఆమె నార్మల్ గా బైక్ డ్రైవ్ చెయ్యకుండా స్టంట్(Women bike stunt) చెయ్యడం మొదలుపెడుతుంది. ఆమె ఎంతో ఆత్మవిశ్వాసంతో బైక్ ను వేగంగా నడుపుతూ అమాంతం ముందు చక్రాన్ని పైకి లేపుతుంది. బ్యాక్ టైర్ సహాయంతో బైక్ డ్రైవ్ చేస్తూ సీట్ వెనుక భాగంలో దూకుతుంది. రెండుకాళ్ళతో నిలబడి పదే పదే చిన్నపిల్లలగా గెంతుతుంది. ఆ తరువాత ఒక కాలును బైక్ ఫుట్ పెగ్ పై పెట్టి విన్యాసాలు చేస్తుంది. చివరిగా ఆమె రెండు కాళ్ళు పెట్రోల్ ట్యాంక్ మీద ఉంచి డ్రైవ్ చేయడంతో వీడియో ముగుస్తుంది. సన్నగా చీపురు పుల్లలా ఉన్న ఈ అమ్మాయి అంత డేర్ గా స్టంట్ లు చేయడం చూస్తే గుండె ఆగినంత పనవుతుంది.
Viral Video: ఓ యువతికి బంపరాఫర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా.. ఒకే ఒక్క వీడియోను చూసి జాబ్ ఇస్తానంటూ ప్రకటన..!
ఈ వీడియోను Hasna Zaroori Hai అనే ట్విట్టర్(Twitter) అకౌంట్ నుండి షేర్ చేశారు. 'అబ్బాయిలకు మాత్రమే అన్ని సరదాలు ఎందుకుండాలి?' అనే క్యాప్షన్ మెన్షన్ చేసారు. దీన్ని బట్టి అమ్మాయిలకు కూడా సరదా కావాలి అని చెప్పినట్టుంది. కానీ ఈ వీడియో చూసిన నెటిజన్లు విభిన్నరకాలుగా స్పందిస్తున్నారు. 'ఆమె ధైర్యం, ఆమె ట్యాలెంట్ నిజంగా గ్రేట్' అంటున్నారు. 'ఆమెకు డ్రైవింగ్ లో ఎంత నైపుణ్యం ఉంటే మాత్రం స్టంట్ లో ఏమాత్రం తేడా జరిగినా ప్రాణాలు మిగలవ్' అని ఆమె భద్రత గురించి కామెంట్ చేస్తున్నారు. 'నాకూ ఇలాంటి సరదానే ఉండేది. కానీ ఆ సరదానే పెద్ద ప్రమాదానికి దారితీసింది' అని ఇంకొకరు తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు.