Viral Video: కరెంట్ లేకుండా ఫ్యాన్ తిరగడాన్ని ఎక్కడైనా చూశారా..? ఈ కుర్రాడు పెద్ద అద్భుతమే చేసేశాడు..!
ABN , First Publish Date - 2023-10-26T10:46:56+05:30 IST
ఫ్యాన్లు కరెంట్ ఉంటేనే పనిచేస్తాయి. కరెంట్ లేకపోతే విసనకర్రలతో కుస్తీ పడాలి. కానీ ఓ కుర్రాడు మాత్రం అద్బుతం చేశాడు. అసలు కరెంటే అక్కర్లేకుండా..
కాస్త ఉక్కపోతగా అనిపించినా, బయట ఎండలో తిరిగి వచ్చినా ఫ్యాన్ గాలికి కూర్చుంటే కలిగే హాయి మాటల్లో చెప్పలేనిది. కానీ ఫ్యాన్లు కరెంట్ ఉంటేనే పనిచేస్తాయి. కరెంట్ లేకపోతే ఛార్జింగ్ ఫ్యాన్లు లేదా విసనకర్రలతో కుస్తీ పడాలి. కానీ ఓ కుర్రాడు మాత్రం అద్బుతం చేశాడు. అసలు కరెంటే అక్కర్లేకుండా మాంచి స్పీడ్ తో తిరిగే ఫ్యాన్ ను తయారుచేశాడు. ఈ ఆవిష్కరణకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మొదట విస్తుపోయి ఆ తరువాత ఈ ఫ్యాన్ తయారుచేసిన కుర్రాడి మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
ఫ్యాన్(fan) ప్రతి ఇంటిలో భాగమైపోయింది. చాలా ఇళ్ళలో కరెంట్ లేనప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. కానీ బాగా అలసిపోయినప్పుడు, ఎండకు వెళ్ళొచ్చినప్పుడు ఫ్యాన్ పనిచేయకుంటే మాత్రం చావా చిరాకు, కోపం వస్తాయి. ఓ కుర్రాడు ఈ సమస్యను బాగా అర్థం చేసుకున్నట్టున్నాడు. అందుకే కరెంట్ అవసరం లేని ఫ్యాన్ తయారుచేశాడు(fan running without electric power). వీడియోలో ఓ టేబుల్ మీద ఫ్యాన్, దాని ప్రక్కనే ఓ కుర్రాడు నిలబడుకుని ఉండటం చూడొచ్చు. ఫ్యాన్ కు వెనుక సైకిల్ పెడల్ లాగా ఏర్పాటుచేశారు. ఈ పెడల్ ను చేత్తో పట్టుకుని తిప్పుతూ ఉంటే ఫ్యాన్ తిరుగుతోంది. పెడల్ తిప్పేకొద్ది ఫ్యాన్ వేగం పెగడం చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఫ్యాన్ పదునైన చక్రాలు, దాని వేగం అది పనిచేస్తున్న తీరు నిజంగా చాలా ఆకట్టుకుంటున్నాయి.
Skincare: చలికాలంలో చర్మం పగుళ్లను ఇంత సింపుల్ గా నివారించవచ్చని మీకు తెలుసా? కేవలం ఒకే ఒక్క పదార్థం ఉపయోగిస్తే చాలు!
ఈ వీయోను sahabagorwal ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ కుర్రాడి తెలివికి ఫిదా అవుతున్నారు.తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. 'ఆ ఫ్యాన్ ను వేగంగా తిప్పాలంటే అంతకంటే వేగంగా చెమట చిందించాలి' అని ఒకరు సెటైర్ వేశారు. 'ఇంతకూ అది స్పీడ్ గా తిరగాలంటే ఎన్నవ గేర లో తిప్పాలి?' అంటూ ఇంకొకరు కామెంట్ చేశారు. 'బ్రదర్ నీకు చాలా ట్యాలెంట్ ఉంది, నువ్వుచేసిన ఆవిష్కరణ నిజంగా అధ్బుతం' అని మరొకరు కుర్రాడిని మెచ్చుకున్నాడు.