Share News

Virat Kohli: విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ.. యూపీ రెస్టారెంట్ ఓనర్‌కు కష్టాలు.. చివరకు పోలీసులకు ఫోన్ చేస్తే..

ABN , First Publish Date - 2023-11-18T16:49:07+05:30 IST

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో మూడు శతకాలు సాధించాడు. ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో భారీ సెంచరీ సాధించాడు.

Virat Kohli: విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ.. యూపీ రెస్టారెంట్ ఓనర్‌కు కష్టాలు.. చివరకు పోలీసులకు ఫోన్ చేస్తే..

టీమిండియా (Team India) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో మూడు శతకాలు సాధించాడు. ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో భారీ సెంచరీ సాధించాడు (Virat Kohli Century). కోహ్లీ చేసిన ఈ సెంచరీ ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh)లోని ఓ రెస్టారెంట్ (UP Restaurant) ఓనర్‌కు కష్టాలు తెచ్చిపెట్టింది. చివరకు అతడు పోలీసులకు ఫోన్ చేస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాలేదు.

యూపీలోని బరియాక్ జిల్లాకు చెందిన ఓ రెస్టారెంట్ ఓనర్ సెమీ ఫైనల్ రోజు ఓ స్పెషల్ ఆఫర్ పెట్టాడు (Biryani Offer). సెమీస్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఎన్ని పరుగులు చేస్తే తమ రెస్టారెంట్‌లో బిర్యానీ మీద అంత డిస్కౌంట్ ఇస్తానని ప్రకటించాడు. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఏకంగా 117 పరుగులు చేశాడు. దీంతో ఆ రెస్టారెంట్‌కు స్థానికులు పోటెత్తారు. దాదాపు ఉచితంగా బిర్యానీ పార్సిల్ తీసుకునేందుకు ఎగబడ్డారు. దీంతో ఆ రెస్టారెంట్ ఓనర్ పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు (Viral News).

Elections: రోడ్డు పక్కన వృద్ధుడి దగ్గరకు వెళ్లి చెప్పు దెబ్బలు తిన్న వ్యక్తి.. కారణమేంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..

బుధవారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో కోహ్లీ 50వ అంతర్జాతీయ వన్డే శతకం సాధించాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు, క్రికెట్ దిగ్గజాలు కోహ్లీపై ప్రశంసలు కురిపించారు. ఆదివారం జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.

Updated Date - 2023-11-18T16:49:09+05:30 IST