Metro Train: తప్పు బాబూ.. అలా చేయొద్దంటూ మెట్రో రైల్లో ఓ మహిళ చెప్పినా పట్టించుకోని కుర్రాడు.. ఇద్దరు యువతులతో..!
ABN , First Publish Date - 2023-08-26T15:30:14+05:30 IST
ఢిల్లీ మెట్రో అంటే కేవలం జర్నీ మాత్రమే కాదు.. ``రొమాన్స్`` నుంచి 'థ్రిల్' వరకు అన్నీ ఢిల్లీ మెట్రలో చూడవచ్చు. ఎంతో మంది ఢిల్లీ మెట్రోల వీడియోలు రికార్డు చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అలాగే చాలా ప్రేమజంటలు మెట్రోలోనే రొమాన్స్ సాగిస్తూ దొరికిపోయారు. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఢిల్లీ మెట్రో (Delhi Metro) అంటే కేవలం జర్నీ మాత్రమే కాదు.. ``రొమాన్స్`` నుంచి 'థ్రిల్' వరకు అన్నీ ఢిల్లీ మెట్రోలో చూడవచ్చు. ఎంతో మంది ఢిల్లీ మెట్రోల వీడియోలు (Delhi Metro Videos) రికార్డు చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అలాగే చాలా ప్రేమజంటలు మెట్రోలోనే రొమాన్స్ సాగిస్తూ దొరికిపోయారు. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ యువకుడు ఓ అమ్మాయితో వాగ్వాదానికి దిగాడు. వారి గొడవను ఆపేందుకు ఓ ఆంటీ మధ్యలోకి వచ్చింది.
Priya singh అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేసింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో మెట్రో రైలులో కూర్చున్న అమ్మాయి వైపు ఓ అబ్బాయి వెళ్లి గొడవకు దిగాడు. ఇద్దరిలో ఎవ్వరూ వెనక్కి తగ్గకుండా వాదించుకున్నారు. వారి వాదన ఎంతకీ తగ్గకపోవడంతో ఓ మహిళ వెళ్లి వారిని శాంతింప చేసేందుకు ప్రయత్నించింది. అయినా ఇద్దరూ ఊరుకోలేదు. ఇంతలో మరో యువతి కూడా ఆ అబ్బాయికి వ్యతిరేకంగా మాట్లాడింది. చివరకు ఆ అమ్మాయితో కూడా కుర్రాడు మాటల దాడి ప్రారంభించాడు. ఈ ఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు (Boy and girl fight in Delhi Metro).
Viral Video: దప్పికతో కుళాయి దగ్గర ఓ కుక్క తంటా.. నీళ్లు రాకపోవడంతో నీరసం.. అటుగా వెళ్తున్న ఓ యువతి చూసి..!
ఈ వీడియో తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటివరకు 19 వేల మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోలోని కుర్రాడిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ``ఆ కుర్రాడు చాలా దూకుడుగా ప్రవర్తిస్తున్నాడు``, ``అతడిని పోలీసులకు అప్పగించాల్సింది``, ``ఢిల్లీ మెట్రో ఎంటర్టైన్మెంట్కు అడ్డా`` అని నెటిజన్లు కామెంట్లు చేశారు.