Viral Video: మనం సరదాగా పేల్చే టపాసులను ఎలా తయారు చేస్తున్నారో చూడండి.. వారు ఎలాంటి పరిస్థితుల్లో పని చేస్తున్నారంటే..

ABN , First Publish Date - 2023-09-26T20:23:58+05:30 IST

దీపావళికి మాత్రమే కాదు.. ఏ పండగ జరిగినా, ఏ సంబరం చేసుకోవాలన్నా బాణాసంచా కాల్చడం తప్పని సరిగా మారిపోయింది. ఈ బాణాసంచా వల్ల శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం పెరిగిపోతాయని పర్యావరణ వేత్తలు ఎంతగా గగ్గోలు పెట్టినా ఎవరూ వినడం లేదు.

Viral Video: మనం సరదాగా పేల్చే టపాసులను ఎలా తయారు చేస్తున్నారో చూడండి.. వారు ఎలాంటి పరిస్థితుల్లో పని చేస్తున్నారంటే..

దీపావళికి మాత్రమే కాదు.. ఏ పండగ జరిగినా, ఏ సంబరం చేసుకోవాలన్నా బాణాసంచా (Firce Crackers) కాల్చడం తప్పని సరిగా మారిపోయింది. ఈ బాణాసంచా వల్ల శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం పెరిగిపోతాయని పర్యావరణ వేత్తలు ఎంతగా గగ్గోలు పెట్టినా ఎవరూ వినడం లేదు. ఎంతో సంతోషంగా థౌజండ్ వాలాలు, టెన్ థౌజండ్ వాలాలు కాలుస్తుంటారు. అలాంటి టపాసులను తయారు చేయడంలో ఎలాంటి కష్టాలు ఉంటాయో, ఈ పని చేసే వ్యక్తులు ఎంత రిస్క్ తీసుకుంటారో మాత్రం మనం ఊహించలేం (Viral Video).

టపాసులను తయారు చేస్తున్న షాకింగ్ వీడియో (Fire Crackers Making) ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. murat47oral అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో కొందరు కార్మికులు భారీ స్థాయిలో టపాసులను తయారు చేస్తున్నారు. పేపర్‌లను కట్ చేయడం, వాటిల్లో గన్ పౌడర్‌ను నింపడం, వాటిని ఎండబెట్టడం వంటివి చేస్తున్నారు. అయితే ఆ కార్మికుల ఒంటి నిండా గన్ పౌడర్ అంటుకుపోయి ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Train Video: అది రైలా.. ఆర్టీసీ బస్సా..? ఫుల్లు స్పీడుతో ట్రైన్ దూసుకొస్తోంటే బ్రిడ్జిపైనే కూర్చున్న ముగ్గురు కుర్రాళ్లు.. చివరకు..!

ఇప్పటివరకు ఈ వైరల్ వీడియోను 22 లక్షల మంది వీక్షించారు. ఎంతో మంది ఆ కార్మికుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ``పాపం.. వారు ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తున్నారో చూస్తే బాధగా ఉంది``, ``వారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండగలరా``, ``వారి కష్టాన్ని, ప్రమాదాన్ని ఎవరూ పట్టించుకోరు``, ``టపాసుల వినియోగాన్ని తగ్గించాలి`` అని నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-09-26T20:23:58+05:30 IST