Interesting Video: మనం వాడే రబ్బర్ బ్యాండ్‌లను ఎలా తయారు చేస్తారో తెలుసా? సీక్రెట్ రివీల్ చేసిన వైరల్ వీడియో!
ABN , Publish Date - Dec 19 , 2023 | 12:13 PM
మనం ప్రతిరోజూ వాడే చిన్న చిన్న వస్తువులు ఎలా తయారవుతాయో మనకు తెలియదు. వాటి తయారీ ప్రక్రియ ఏంటో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మనం ప్రతి రోజూ ఎన్నో అవసరాలకు రబ్బర్ బ్యాండ్లను వాడుతుంటాం. మరి, ఆ రబ్బరు బ్యాండ్లను ఎలా తయారు చేస్తారో తెలుసా?
మనం ప్రతిరోజూ వాడే చిన్న చిన్న వస్తువులు ఎలా తయారవుతాయో మనకు తెలియదు. వాటి తయారీ ప్రక్రియ ఏంటో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మనం ప్రతి రోజూ ఎన్నో అవసరాలకు రబ్బర్ బ్యాండ్లను (Rubber Bands) వాడుతుంటాం. ఆడవాళ్లు జడలు వేసుకోవడం దగ్గర్నుంచి, పేపర్లను, డబ్బులను చుట్టి ఉంచడానికి, ఇంకా ఎన్నో అవసరాలకు రబ్బరు బ్యాండ్లను ఉపయోగిస్తుంటాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) రబ్బరు బ్యాండ్లు తయారు చేసే ప్రక్రియను చూపెడుతోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Making of Rubber bands).
foodexplorerlalit అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో కొందరు వ్యక్తులు రబ్బరు చెట్ల నుంచి ద్రవాన్ని సేకరిస్తున్నారు. ఆ ద్రవాన్ని పెద్ద డ్రమ్ములో వేసి రంగు కలుపుతున్నారు. ఆ తర్వాత ఆ ద్రవంలోకి ఇనుప చట్రాలను దించుతున్నారు. ఆ చట్రాలకు అంటుకుని ఆరిపోయిన తర్వాత వచ్చిన రబ్బరును మెషిన్ సహాయంతో కట్ చేస్తున్నారు. ఈ వీడియో నెట్టింట బాగా హల్‌చల్ చేస్తోంది.
Shocking Video: వామ్మో.. గాలికి ఎంత బలముందో చూశారా? రన్ వేపై విమానాన్ని ఎలా తిప్పేసిందో చూడండి..
ఈ వీడియోను కేవలం ఆరు రోజుల వ్యవధిలో 2.8 కోట్ల మందికి పైగా వీక్షించారు. 7 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ ఆసక్తికర వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఎంత అద్భుతం``, ``ఓహో.. రబ్బరు బ్యాండ్లు ఇలా తయారవుతాయన్నమాట``, ``ఇలాంటి వీడియో ఎప్పుడూ చూడలేదు``, ``చాలా ఆసక్తికరం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.