Share News

Viral Video: దీపావళికి ఈ పాప్-పాప్ క్రాకర్స్ కాల్చారా? వీటిని ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో తయారు చేస్తారో తెలుసా?

ABN , First Publish Date - 2023-11-19T16:22:55+05:30 IST

ఈ దీపావళిని దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. మంచు తీవ్రత ఎక్కువగా ఉండే ఉత్తరాది ప్రాంతాల్లో పొగ ఎక్కువగా వచ్చే టపాసులను కాల్చకూడదని చాలా మంది నిర్ణయించుకున్నారు.

Viral Video: దీపావళికి ఈ పాప్-పాప్ క్రాకర్స్ కాల్చారా? వీటిని ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో తయారు చేస్తారో తెలుసా?

ఈ దీపావళిని (Diwali) దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. టపాసులు (Crackers) కాల్చి సంబరాలు చేసుకున్నారు. మంచు తీవ్రత ఎక్కువగా ఉండే ఉత్తరాది ప్రాంతాల్లో పొగ ఎక్కువగా వచ్చే టపాసులను కాల్చకూడదని చాలా మంది నిర్ణయించుకున్నారు. దీంతో కాలుష్యాన్ని తక్కువగా విడుదల చేసే టపాసులు మార్కెట్లో ఎక్కువగా కనిపించాయి. అలాంటి వాటిల్లో పాప్-పాప్ క్రాకర్స్ (Pop Pop firecrackers) ఒకటి. వీటిని ఎక్కువగా చిన్న పిల్లల కోసమే తయారు చేస్తారు. అయితే పెద్ద వాళ్లు కూడా వీటిని కాల్చి సరదా పడుతుంటారు (Viral Video).

ఈ పాప్-పాప్ క్రాకర్స్‌ను ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? పాప్ పాప్ క్రాకర్స్ కర్మాగారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ys_gyan అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ అయిన ఈ వీడియో చూసి చాలా మంది షాక్‌కు గురవుతున్నారు. ముందుగా చిన్న చిన్న పాలరాతి ముక్కలను ఒక మెషిన్‌లో వేసి కడిగి ఆరబెట్టారు. ఆ తరువాత, ఒక యంత్రంలో పాలరాయి ముక్కలపై మందుగుండు వేశారు. చివరగా, మందుగుండుతో నిండిన పాలరాతి ముక్కలను రంగు కాగితాలలో చుట్టి వాటిని ప్యాక్ చేశారు. ఆపై వాటిని పెట్టెల్లో నింపి విక్రయించడానికి మార్కెట్‌కు పంపించారు.

Viral: ఈ ట్యాగ్ లైన్స్ చూస్తే నవ్వుకోవాల్సిందే.. కార్ల యాజమానుల క్రియేటివిటీపై నెటిజన్లు ప్రశంసలు!

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. 1.36 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``దీనిని వెల్లుల్లి బాంబు అని పిలుస్తాం``, ``ఇది చాలా సురక్షితమైనవి``, ``కాల్చేటపుడు కంటే వీటిని తయారు చేసేటపుడే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-11-19T16:22:57+05:30 IST