Viral Video: మీరు మూరీ మిక్చర్ ఎక్కువగా తింటుంటారా? మూరీలను ఎలా తయారు చేస్తున్నారో చూస్తే ఇకపై తినరేమో!
ABN , First Publish Date - 2023-11-07T20:16:49+05:30 IST
మరమరాలతో తయారు చేసిన స్నాక్స్‌ను తినేందుకు చాలా మంది ఇష్టపడతారు. ముఖ్యంగా చాలా చోట్ల మూరీలతో మిక్చర్ చేసి అమ్ముతుంటారు. ఉత్తరాదిన బేల్‌పురి పేరుతో మూరీలతో మిక్చర్ తయారు చేస్తారు. ఈ స్నాక్‌ను చాలా మంది ఇష్టపడతారు. అయితే ఈ మూరీలను ఎలా తయారు చేస్తారో తెలుసా?
మరమరాల (Murmur)తో తయారు చేసిన స్నాక్స్ (Snacks)ను తినేందుకు చాలా మంది ఇష్టపడతారు. ముఖ్యంగా చాలా చోట్ల మూరీలతో మిక్చర్ చేసి అమ్ముతుంటారు. ఉత్తరాదిన బేల్‌పురి (Bhelpuri) పేరుతో మూరీలతో మిక్చర్ తయారు చేస్తారు. ఈ స్నాక్‌ను చాలా మంది ఇష్టపడతారు. ఇది మాత్రమే కాకుండా చాలా ఆహార పదార్థాల తయారీలో మూరీలను వాడుతుంటారు. అయితే ఈ మూరీలను ఎలా తయారు చేస్తారో తెలుసా? ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూస్తే షాక్ అవక తప్పదు.
foodie_incarnate అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Shocking Video) షేర్ అయింది. ఓ ఫ్యాక్టరీలో బియ్యం నుంచి మరమరాలను (Puffed Rice) తయారు చేస్తున్నారు. ఓ వ్యక్తి కాలితో ఆ బియ్యాన్ని తొక్కుతున్నాడు. మరో వ్యక్తి అపరిశుభ్రమైన నీటితో ఆ బియ్యాన్ని కడుగుతున్నాడు. ఆ మరమరాలు తయారు చేసే ప్రాసెస్ మొత్తం చాలా మురికిగా, అపరిశుభ్రంగా ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత మరమరాలతో తయారు చేసిన ఆహారాన్ని తినాలంటే ఆలోచించుకోవాల్సిందే (Food and Health).
Viral Video: ఇదెక్కడి పైత్యం రా బాబూ.. మద్యంతో టీ ఏంటి? అతడికి గిరాకీ ఎలా ఉందో చూడండి..
ఇది పాత వీడియోనే అయినప్పటికీ మళ్లీ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోకు కోట్లలో వ్యూస్ వచ్చాయి. దాదాపు 17 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``అబ్బా.. ఎంత అపరిశుభ్రంగా ఉంది``, ``ఇకపై బేల్‌పురీ తినలేను``, ``చాలా స్నాక్స్‌ను ఇలాగే తయారు చేస్తారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.