Watermelon In Fridge: సమ్మర్ కదా అని పుచ్చకాయలను తెగ లాగించేస్తున్నారా..? ఫ్రిడ్జ్‌లో పెట్టి మాత్రం అస్సలు తినొద్దు.. ఎందుకంటే..!

ABN , First Publish Date - 2023-03-10T10:54:27+05:30 IST

ఫ్రిజ్ లో ఉంచి తీసిన పుచ్చకాయను చల్లగా ఆస్వాదించడం అందరికీ ఇష్టం. కానీ

Watermelon In Fridge: సమ్మర్ కదా అని పుచ్చకాయలను తెగ లాగించేస్తున్నారా..? ఫ్రిడ్జ్‌లో పెట్టి మాత్రం అస్సలు తినొద్దు.. ఎందుకంటే..!

మార్చి(March) నెలతో వేసవికాలం(Summer) మొదలయ్యింది. ఇంట్లో కూరగాయల దగ్గర నుండి పండ్ల వరకు ఏది బయట పెట్టినా తొందరగా వాడిపోతాయి. ఈ కారణంతో ప్రతి ఒక్కటి ఫ్రిజ్(Fridge) లో తోసేస్తుంటారు అందరూ. మరీ ముఖ్యంగా పండ్లను ఫ్రిజ్ లో పెట్టుకుని చల్లగా తింటే అదొక తృప్తి. అదే కోవలో పుచ్చకాయను(Watermelon) కూడా ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. బయట ఎండ మండుతుంటే చల్లగా పుచ్చకాయ తినడం ఈ వేసవిలో అందరూ చేసేదే..కానీ పుచ్చకాయ ఇలా తినొద్దని చెబుతున్నారు ఆహార నిపుణులు(Food Experts). దీని వెనుక నిజం తెలిస్తే అసలు పుచ్చకాయను ఫ్రిజ్ లో పెట్టడం అనే ఆలోచనే మానేస్తారు. దీని గురించి తెలుసుకుంటే..

సీజన్ కు తగ్గట్టుగా లభించే పండ్లలో పుచ్చకాయ ఒకటి. వేసవిమీద యుద్దం చెయ్యడానికి పుచ్చకాయ చాలా మంచి ఎంపిక. పిల్లలకు, పెద్దలకు ఎంతో ఇష్టమైన పుచ్చకాయకు చాలా డిమాండ్ ఉంటుంది ఈ వేసవిలో. ఫ్రిజ్ లో ఉంచి తీసిన పుచ్చకాయను చల్లగా ఆస్వాదించడం అందరికీ ఇష్టం. కానీ పుచ్చకాయను ఇలా ఫ్రిజ్ లో ఉంచి తింటే ప్రయోజనాలు ఉండవు. శరీరంలో పెరిగిపోయిన ఉష్ట్రోగ్రతను(Body Temperature) తగ్గించి, శరీరాన్ని చల్లబరిచే పుచ్చకాయను గది ఉష్ట్రోగ్రత వద్ద ఉంచి తినడమే మంచిది. పుచ్చకాయను ఫ్రిజ్ లో ఉంచితే అందులో ఉండే సిట్రులైన్(citrulline) అమైనో ఆమ్లం(Amino Acid) మందగిస్తుంది. ఈ అమైనో ఆమ్లం మన శరీరంలో రక్తప్రవాహాన్ని(Blood Flow), రక్తపోటును(Blood Pressure) నియంత్రించే నైట్రిక్ ఆక్సైడ్(Nitric Oxide) ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. పుచ్చకాయలను ఫ్రిజ్ లో పెట్టుకుని తినడం వల్ల మనం ఈ ప్రయోజనాన్ని కోల్పోతాం.

పుచ్చకాయ తినడం వల్ల మన శరీరంలో ఉండే టాక్సిన్(Toxin) లు బయటకు వెళ్ళిపోతాయి. వీటిలో 92శాతం నీరు(92% Water Content), 16శాతం విటమిన్-సి (16% Vitamin-c) ఉంటుంది. పుచ్చకాయలను ఫ్రిజ్ లో ఉంచినప్పుడు కాయలలో ఉన్న నీటిశాతం తగ్గిపోతుంది. ఫలితంగా విటమిన్-సి కూడా తగ్గుతుంది.

ఇందులో ఉండే బీటా కెరోటిన్(Beta Carotene), లూటిన్(Lutein), జియాక్సంతిన్(Zeaxanthin) వంటి పోషకాలు కంటి ఆరోగ్యానికి చాలా మంచివి, కళ్ళు అలసిపోవడం, కళ్ళలో మచ్చలు ఏర్పడటం వంటి సమస్యలు ఉంటే పుచ్చకాయ మంచి ఆప్షన్. కానీ పుచ్చకాయ ఫ్రిజ్ లో పెట్టుకుని తింటే ఈ పోషకాలన్నీ తగ్గిపోతాయి. ఫ్రిజ్ లో ఉంచిన పుచ్చకాయ తిన్నవారికంటే.. గది ఉష్ట్రోగ్రత(Room Temperature) వద్ద ఉంచిన పుచ్చకాయ తిన్న వ్యక్తుల్లో మంచి ఆరోగ్యకరమైన ఫలితాలు ఉన్నాయని ఆహార శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వ్యాయామం(Exercise) తరువాత పుచ్చకాయ ముక్కలు తిన్నా, జ్యూస్ తీసుకున్నా శరీరంలో కండరాలకు(Muscles) చాలా మంచి ఉవశమనం లభిస్తుంది. కానీ ఫ్రిజ్ లో ఉంచిన పుచ్చకాయ తినడం, ఫ్రిజ్ లో ఉంచిన జ్యూస్ తాగడం వల్ల అవి కండరాల మీద ఏ విధమైన ప్రభావాన్ని చూపలేవు.

పుచ్చకాయ తిన్న తరువాత మనశరీరం కొన్ని పోషకాలను ఉత్పత్తి చేస్తుంది. కానీ ఫ్రిజ్ లో పెట్టిన పుచ్చకాయను తింటే పోషకాల ఉత్పత్తి తగినంత జరగదు. ఇలా పుచ్చకాయను ఫ్రిజ్ లో పెట్టుకుని తింటే చల్లగా తిన్న ఫీల్ తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు.

Read also: AC vs Cooler: ఏసీ కొనేంత బడ్జెట్ లేదా..? ఈ సింపుల్ టిప్స్‌తో కూలర్‌తోనే ఏసీని మించిన చల్లదనం..!


Updated Date - 2023-03-10T11:00:54+05:30 IST