Share News

Wedding Anniversary: మొదటిపెళ్లి రోజు నాడే భర్తకు మైండ్ బ్లాకయ్యే షాకిచ్చిన భార్య.. యానివర్శరీ స్పెషల్ గిఫ్ట్ అంటూ..!

ABN , First Publish Date - 2023-11-23T14:44:53+05:30 IST

పెళ్లయ్యాక వచ్చే మొదటి బర్త్డే, మొదటి పెళ్లిరోజు చాలా స్పెషల్.. ఓ భార్య భర్తకు ఇచ్చిన బహుమతి చూస్తే షాకవుతారు.

Wedding Anniversary: మొదటిపెళ్లి రోజు నాడే భర్తకు మైండ్ బ్లాకయ్యే షాకిచ్చిన భార్య.. యానివర్శరీ స్పెషల్ గిఫ్ట్ అంటూ..!

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి కీలకమైన మలుపు. ఒక్కరు కాస్తా ఇద్దరై.. ఇద్దరి ఇష్టాలతో సాగే కొత్త జీవితమది. పెళ్లికి ముందు కొందరు, పెళ్లి తరువాత మరికొందరు తమ భాగస్వాములకు ఏదో ఒక బహుమతి ఇచ్చి వారిని ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. అయితే పెళ్లయ్యాక వచ్చే మొదటి బర్త్డేకు, మొదటి పెళ్లిరోజుకు మాత్రం జీవితంలో చాలా స్పెషల్ గా ఉండే బహుమానం తప్పక ఇచ్చి పుచ్చుకుంటారు. ఓ భార్య మొదటి పెళ్లిరోజు సందర్బంగా తన భర్తకు ఇచ్చిన బహుమతి ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ బహుమతి చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

జీవిత భాగస్వాములు(Life partners) ప్రత్యేక రోజులకోసం బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం మామూలే. కొత్తగా పెళ్లయినవారికి ఆ ప్రత్యకత కూడా అక్కర్లేదు. ఇక మొదటి పెళ్లిరోజు అనగానే బహుమతి ఏమివ్వాలో అని చాలా ఆలోచిస్తారు. మగవారు అయితే మంచి చీరలో, నగలో ఇస్తారు. లేదంటే మంచి టూర్ ప్లాన్ చేస్తారు. ఇక ఆడవారు అయితే వాచ్, ఉంగరం, బట్టలు వంటివి ఇస్తుంటారు. కానీ ఈ భార్య మాత్రం చాలా స్పెషలండీ బాబూ.. ఈమె మొదటి పెళ్లిరోజు బహుమతిగా తన భర్తకు ఏకంగా టైర్ల సెట్ ను బహుమతిగా ఇచ్చింది. ఫోటోలో పడక గదిలో బెడ్ కు ముందు టైర్లను ప్యాక్ చేసి వాటికి తెలుపు, నలుపు బెలూన్ లను అలంకరించి ఉండటం చూడచ్చు. ఇవి వాహనాలకు ఉపయోగించాలా లేక వ్యాయామం కోసం ఉపయోగించాలా అనేది అర్థం కాలేదు. ఇది కాస్తా సోషల్ మీడియాలో షేర్ చేయంతో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Doctor: ఈ డాక్టర్ నిజంగా దేవుడే.. ఎమర్జెన్సీగా అవయవ మార్పిడి.. అంబులెన్స్‌లో వస్తోంటే యాక్సిడెంట్..!



ఈ బహుమతికి సంబంధించిన ఫోటోను Life in Saudi Arabia అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ నుండి షేర్ చేశారు. దీన్ని బట్టి ఇది సౌదీ అరేబియా(Saudi Arabia)లో నివసించే ఓ భార్య చేసిన చిలిపి పని అని అర్థమవుతోంది. 'ఓ భార్య తన మొదటి పెళ్లిరోజు సందర్భంగా టైర్ల సెట్టును భర్తకు బహుమానంగా ఇచ్చింది' అంటూ క్యాప్షన్ మెన్షన్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు పలువిధాలుగా కామెంట్ చేస్తున్నారు. 'ఏ భార్య కూడా తన భర్తకు ఇలాంటి బహుమతి ఇవ్వడం గురించి ఆలోచించదు' అని కామెంట్ చేశారు. 'బహుశా ఆమె నిజమైన బహుమతి టైర్ల లోపల ఉండి ఉంటుందేమో' అని మరొకరు అన్నారు. 'ఆమె చాలా సూపర్' అని మరొకరు కామెంట్ చేశారు.

ఇది కూడా చదవండి: 40 ఏళ్లు దాటినా.. యంగ్‌గా కనిపించేందుకు 7 టిప్స్..!

Updated Date - 2023-11-23T14:44:54+05:30 IST