బ్రాండెడ్- జెనరిక్ మందుల మధ్య తేడా ఇదే.. ఆ ఔషధాలు ఎందుకు అంత తక్కువ ధరకు లభిస్తాయంటే..

ABN , First Publish Date - 2023-04-30T12:34:20+05:30 IST

ఇప్పుడున్న రోజుల్లో మన కుటుంబంలో ఎవరికైనా తీవ్రమైన అనారోగ్యం వస్తే మందులకు అధికంగా డబ్బు ఖర్చు చేయాల్సివస్తుంది. దీనిని నివారించే ఉద్దేశంతోనే తక్కువ ధరకు లభ్యమయ్యే జెనరిక్ ఔషధాలపై(generic drugs) ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది.

బ్రాండెడ్- జెనరిక్ మందుల మధ్య తేడా ఇదే.. ఆ ఔషధాలు ఎందుకు అంత తక్కువ ధరకు లభిస్తాయంటే..

ఇప్పుడున్న రోజుల్లో మన కుటుంబంలో ఎవరికైనా తీవ్రమైన అనారోగ్యం వస్తే మందులకు అధికంగా డబ్బు ఖర్చు చేయాల్సివస్తుంది. దీనిని నివారించే ఉద్దేశంతోనే తక్కువ ధరకు లభ్యమయ్యే జెనరిక్ ఔషధాలపై(generic drugs) ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది. ఇవి బ్రాండెడ్ ఔషధాల కన్నా ఎందుకు తక్కువ ధరకు లభ్యమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఔషధ కంపెనీలు(Pharmaceutical companies) వ్యాధుల చికిత్సపై పరిశోధనలు సాగిస్తాయి. వాటి ఆధారంగా ఔషధాలను తయారు చేస్తాయి. అవి టాబ్లెట్, క్యాప్సూల్ లేదా ఇతర ఔషధాల రూపంలో మనకు అందుబాటులోకి వస్తాయి. వివిధ కంపెనీలు ఒకే ఔషధాన్ని వివిధ పేర్లతో తయారు చేసి, వివిధ ధరలకు విక్రయిస్తుంటాయి. ఆ ఔషధానికి సాధారణ పేరును ప్రత్యేక కమిటీ(Special Committee) నిర్ణయిస్తుంది. అది ప్రపంచమంతటా ఒకే విధంగా ఉంటుంది. ఫార్ములా ఆధారంగా వివిధ రసాయనాలను(chemicals) కలపడం ద్వారా ఔషధాలను తయారు చేస్తారు. ఉదాహరణకు జ్వరానికి ఏదైనా ఔషధాన్ని ఒక పెద్ద కంపెనీ తయారు చేస్తే, అది బ్రాండ్ అవుతుంది. ఆ కంపెనీ ఆ ఔషధానికి పేరు మాత్రమే నిర్ణయిస్తుంది. ఇదే సందర్భంలో ఒక చిన్న కంపెనీ ఇదే ఔషధాన్ని తయారు చేస్తే, దానిని జనరిక్ ఔషధం అంటారు.

ఈ రెండింటి ప్రభావంలో తేడా ఉండదు. పేరు, బ్రాండ్ మాత్రమే మారుతుంది. అందుకే ఔషధం కొనుగోలు చేసేటప్పుడు బ్రాండ్ లేదా కంపెనీపై కాకుండా దాని తయారీని గుర్తించాలి. జెనరిక్ ఔషధం తయారీకి ఆ ఫార్ములా(formula)పై పేటెంట్ ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో తయారైన జనరిక్ ఔషధాలు బ్రాండెడ్ ఔషధాల మాదిరిగానే ప్రభావం చూపుతాయి. జెనరిక్ ఔషధాల మోతాదు, ప్రభావం ఇతర బ్రాండెడ్ ఔషధాల మాదిరిగానే ఉంటుంది. పేటెంట్ బ్రాండెడ్ ఔషధాల ధరను ఆయా కంపెనీలు నిర్ణయిస్తాయి. వారు ఈ ఔషధాల తయారీకి సాగించే పరిశోధన, అభివృద్ధి, మార్కెటింగ్(Marketing), ప్రమోషన్, బ్రాండింగ్ కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. ప్రభుత్వ జోక్యంతో జనరిక్ మందుల ధరలు నిర్ణయమవుతాయి. వాటికి ప్రచార ఖర్చు ఉండదు.

Updated Date - 2023-04-30T12:34:54+05:30 IST