ఎప్పటికైనా నీ భార్యను పెళ్లి చేసుకుంటానంటూ హెచ్చరించిన యువకుడు.. అయినా పట్టించుకోని భర్త.. ఓ రోజు అనుకోకుండా..
ABN , First Publish Date - 2023-01-05T21:21:18+05:30 IST
సవ్యంగా సాగుతున్న సంసారాల్లో ఒక్కోసారి అనుకోని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అంతవరకూ సక్రమంగా ఉన్న దంపతులు.. చివరకు సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. రాజస్థాన్‌లో ఓ కుటుంబం విషయంలో ఇలాగే జరిగింది. తొమ్మిదేళ్ల క్రితం..
సవ్యంగా సాగుతున్న సంసారాల్లో ఒక్కోసారి అనుకోని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అంతవరకూ సక్రమంగా ఉన్న దంపతులు.. చివరకు సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. రాజస్థాన్‌లో ఓ కుటుంబం విషయంలో ఇలాగే జరిగింది. తొమ్మిదేళ్ల క్రితం ఓ వ్యక్తి వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల సదరు యువకుడు, ఎప్పటికైనా నీ భార్యను పెళ్లి చేసుకుంటా.. అని వార్నింగ్ ఇచ్చాడు. అయినా భర్త పట్టించుకోలేదు. ఇటీవల ఓ రోజు అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ (Rajasthan) సికార్ జిల్లా ఖేత్రి ప్రాంతానికి చెందిన దిల్బాగ్ సింగ్‌కు సుశీల అనే యువతితో 2005లో (marriage) వివాహమైంది. వీరికి ఓ కొడుకు ఉన్నాడు. ఇదిలావుంగా 2013లో దిల్బాగ్ సింగ్ బంధువు సుభాష్ అనే వ్యక్తి.. సుశీలపై అత్యాచారం చేశాడు. దీంతో అప్పట్లో సుభాష్‌పై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. అప్పటి నుంచి దిల్బాగ్ సింగ్, సుభాష్ కుటుంబాల మధ్య గొడవలు (quarrels) జరుగుతున్నాయి. దిల్బాగ్ సింగ్‌ను తరచూ సుభాష్ బెదిరిస్తూ ఉండేవాడు. ‘‘ఎప్పటికైనా నీ భార్యను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకుంటా’’.. అని హెచ్చరిస్తూ ఉండేవాడు. అయినా దిల్బాగ్ సింగ్ అవేవీ పట్టించుకునేవాడు కాదు.
అయితే ఇటీవల ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఓ రోజు ఉన్నట్టుండి దిల్బాగ్ సింగ్ భార్య కనిపించలేదు. ఇంట్లో పరిశీలించగా.. నగలు, నగదు కూడా కనిపించలేదు. దీంతో షాక్ అయిన దిల్బాగ్ సింగ్.. పోలీసులను ఆశ్రయించాడు. తన భార్యను బంధువు సుభాష్ ప్రలోభపెట్టి.. తనతో పాటూ తీసుకెళ్లాడని ఆరోపించాడు. ఎలాగైనా తన భార్యను తనకు అప్పగించాలని వేడుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. సుశీలను నిజంగానే సుభాష్ తీసుకెళ్లాడా.. లేక ఆమె అదృశ్యం వెనుక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా.. అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
భర్తతో మాట్లాడిన తర్వాత తండ్రికి టీ ఇచ్చిన కూతురు.. కాసేపటి తర్వాత ఆమె చేసిన పనికి.. అంతా షాక్..