ఆమెకు నలుగురు పిల్లలు.. అతడికి ఇద్దరు సంతానం.. ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఆత్మహత్య.. మొబైల్‌లో ఉన్న వీడియోలో..

ABN , First Publish Date - 2023-01-12T16:44:50+05:30 IST

ఆమెకు వివాహమై నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. భర్త, పిల్లలతో సంతోషించాల్సిన ఆమె.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. ఇద్దరు పిల్లలు ఉన్న ఓ వ్యక్తితో కలిసి ఒకే ఇంట్లో..

ఆమెకు నలుగురు పిల్లలు.. అతడికి ఇద్దరు సంతానం.. ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఆత్మహత్య.. మొబైల్‌లో ఉన్న వీడియోలో..

ఆమెకు వివాహమై నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. భర్త, పిల్లలతో సంతోషించాల్సిన ఆమె.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. ఇద్దరు పిల్లలు ఉన్న ఓ వ్యక్తితో కలిసి ఒకే ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడంతో అంతా షాక్ అయ్యారు. పోలీసులు వారి మొబైల్‌ను పరిశీలించగా కొన్ని వీడియోలు బయటపడ్డాయి. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

పాపం.. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండరు.. నిండు గర్భిణి అయిన భార్యను డాక్టర్ వద్దకు తీసుకెళ్లి..

crime.jpg

రాజస్థాన్ (Rajasthan) బార్మర్ పరిధి సంగేసరి ప్రాంతానికి చెందిన మాధారం అనే వ్యక్తి.. భార్య మాగి దేవితో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఇదిలావుండగా, ఈ దంపతుల మధ్య ఇటీవల మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. మాగి దేవికి చాలా కాలం క్రితం వేరే వ్యక్తితో ప్రేమ వ్యవహారం (love affair) నడిచింది. ఇప్పటికీ వీరు తరచూ కలుస్తూ ఉండేవారు. అతడికి కూడా వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ప్రేమ విషయం తెలిసినప్పటి నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

యువతిని బలవంతంగా లాక్కెళ్లిన వ్యక్తి.. వీడియోలో కాపాడండి అంటూ వేడుకోలు.. మరుసటి రోజు చూస్తే..

మంగళవారం కూడా వారి మధ్య గొడవ (quarrels) జరిగింది. దీంతో చివరకు ఆమె భర్తతో గొడవపడి.. తన ప్రియుడి వద్దకు వెళ్లింది. బుధవారం రాత్రి ప్రియుడితో కలిసి మద్యం సేవించింది. తర్వాత ఇద్దరూ ఫొటోలు, వీడియోలు తీసుకుని.. వాటిని రీల్స్‌లో పెట్టారు. తర్వాత ఏమైందో ఏమో తెలీదు గానీ ఇద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారి ఫోన్‌లో ఉన్న వీడియోల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.

వరుడు ఇష్టం లేదంటూనే పెళ్లి చేసుకున్న యువతి.. చివరకు అసలు విషయం చెప్పడంతో..

Updated Date - 2023-01-12T16:44:58+05:30 IST