Over eating: నియంత్రణ లేకుండా తిండి తింటున్నారా? వెంటనే వైద్యుడిని సంప్రదించకపోతే...
ABN , First Publish Date - 2023-04-01T12:44:52+05:30 IST
కొందరు అమితంగా ఆహారం తీసుకుంటుంటారు. వారికి ఆహారం తీసుకోవడంపై నియంత్రణ ఉండదు. ఈ సమస్యను 'బులిమియా నెర్వోసా' అని అంటారు.
కొందరు అమితంగా ఆహారం తీసుకుంటుంటారు. వారికి ఆహారం తీసుకోవడంపై నియంత్రణ ఉండదు. ఈ సమస్యను 'బులిమియా నెర్వోసా' అని అంటారు. ఈ వ్యాధి సోకిన వ్యక్తికి ఎంత తినాలో, ఎప్పుడు తినడం ఆపాలో తెలియదు. దీనితో బాధపడుతున్న వ్యక్తి తక్కువ సమయంలో ఎక్కువ ఆహారం తీసుకుంటాడు. తరువాత జరిగిన పొరపాటు గుర్తించి, బలవంతంగా వాంతులు చేసుకోవడం ద్వారా శరీరం నుండి ఆహారాన్ని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తాడు.
బులీమియా నెర్వోసా బారినపడిన వ్యక్తి తాను ఎప్పుడు, ఎంత తింటున్నాననే దానిపై తనకు నియంత్రణ లేదని భావిస్తాడు. ఇటువంటి సమస్య ఎదురైనవారు వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించడం అవసరం. నిర్లక్ష్యం చేయడం ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. కొందరిలో ఈ సమస్య తీవ్రంగా ఉండవచ్చు. సిగ్గు, బిడియం కారణంగా చాలామంది ఈ సమస్యను దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఇటువంటి సందర్భాల్లో బాధితులు సంకోచించకుండా వైద్యుల సలహా తీసుకోవడం ఎంతో ముఖ్యం.