అకస్మాత్తుగా భయం, గుండెలో దడ.. వెన్నులో వణుకు... వీటికి మూలకారణం ఇదేనంటూ తేల్చిచెప్పిన శాస్త్రవేత్తలు!
ABN , First Publish Date - 2023-04-03T11:29:02+05:30 IST
భయానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు(Scientists) ఇటీవల ఒక పరిశోధన చేశారు. ఇందుకోసం ఎలుకల మెదడులో ఉండే న్యూరాన్ల కార్యకలాపాలను పరిశీలించారు.
భయానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు(Scientists) ఇటీవల ఒక పరిశోధన చేశారు. ఇందుకోసం ఎలుకల మెదడులో ఉండే న్యూరాన్ల కార్యకలాపాలను పరిశీలించారు. ఎలుకలపై పలు ప్రయోగాలు(experiments) చేశారు. పెద్ద శబ్ధాలు, పాత్ర పడిన శబ్దం, కాళ్లకు కరెంటు షాక్(electric shock) తగలడం మొదలైనవి వాటికి ఎదురయ్యేలా చేశారు.
ఫలితంగా ఎలుకల మనసులో కొన్ని మార్పులు వచ్చినట్లు శాస్త్రవేత్తలు(Scientists) గుర్తించారు. ఆ సమయంలో వాటి మెదడులో భయంతో కూడిన మార్పులు చోటుచేసుకున్నాయని నిర్ధారించారు. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం మెదడులో ఇటువంటి రెండు సర్క్యూట్లు(circuits) ఉంటాయి. వీటి కారణంగా మనిషి భయాన్ని అనుభవిస్తాడు.
మెదడులోని అమిగ్డాలా భాగంలోని కాల్సిటోనిన్(Calcitonin) జన్యు సంబంధిత పెప్టైడ్, న్యూరాన్లు(Neurons) భయాందోళనలను సృష్టిస్తాయి. మనిషి భయపడినప్పుడు అతని శరీరంలో ప్రత్యేక హార్మోన్లు(Special hormones), రసాయన మూలకాలు స్రవిస్తాయి. వీటిలో కార్టిసాల్, ఎపినెఫ్రైన్, నోర్‌పైన్‌ఫ్రైన్, కాల్షియం ఉన్నాయని కనుగొన్నారు. భయం ఏర్పడే సమయంలో శరీరానికి సంబంధించిన అన్ని విధులను నియంత్రిస్తారు. కొన్నిసార్లు మితిమీరిన భయం(Excessive fear) ప్రమాదకరమని రుజువయ్యింది. ఇటువంటి పరిస్థితిలోనే గుండెపోటు(heart attack) లేదా మరేదైనా సమస్య తలెత్తవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.