Zero Shadow Day: నడినెత్తిన సూరీడున్నా కనిపించని మనిషి నీడ.. ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన అరుదైన ఘటన..!
ABN , First Publish Date - 2023-04-27T07:36:07+05:30 IST
Zero Shadow Day: మొన్న (ఏప్రిల్ 25) మధ్యాహ్నం 12.17 గంటలకు మనదేశంతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో అకస్మాత్తుగా అన్నింటి నీడ(shadow) కనిపించడం మానేసింది.
Zero Shadow Day: మొన్న (ఏప్రిల్ 25) మధ్యాహ్నం 12.17 గంటలకు మనదేశంతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో అకస్మాత్తుగా అన్నింటి నీడ(shadow) కనిపించడం మానేసింది. ఇది ఒక ప్రత్యేక భౌగోళిక సంఘటన(Special geological event) కారణంగా జరిగింది. దీన్నే జీరో షాడో డే అంటారు. ఇది 130 అక్షాంశం వద్ద ఉన్న అన్ని ప్రదేశాలలో ఏప్రిల్ 25న జరిగింది. కొంతకాలం పాటు.. నిలువుగా ఉన్న వస్తువు లేదా నిలుచున్న మనిషి నీడ ఏర్పడటం ఆగిపోయింది.
భూమిపై ఇలాంటి వింత సంఘటనలు(Strange events) అప్పుడప్పుడు మాత్రమే జరుగుతాయి. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వంటివి ఏర్పడటం వీటిలో ఒక భాగమే. జీరో షాడో డే(Zero Shadow Day) కూడా అటువంటిదే. ఏడాదికి రెండు సార్లు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. తాజాగా ఈ ఘటన చోటుచేసుకుంది. నడినెత్తిన సూరీడు ఉన్నప్పటికీ మనిషి నీడ కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. అందుకే దీన్ని జీరో షాడో డే అంటారు.
ఆ రోజులో ఒక నిర్దిష్ట సమయం(specific time)లో సూర్యుడు మన నడినెత్తి మీదకు వచ్చినా నీడ ఏర్పడదు. అయితే ఆ నీడ పూర్తిగా మాయమైపోతుందని కాదు. వాస్తవానికి ఆరోజు సూర్యుడు(sun) నేరుగా మన నడినెత్తిపై ఉన్నప్పుడు, ఆ కిరణాలు నిలువుగా మనపై పడతాయి. దానివల్ల మన నీడ వేరోచోట వ్యాపించకుండా పూర్తిగా మన పాదాల కిందనే ఏర్పడుతుంది. దీనివల్ల నిటారుగా నిలబడితే నీడ కనిపించదు. ఈ ప్రత్యేక పరిస్థితి(Special situation) భూమి భ్రమణ అక్షం వంపు కారణంగా ఏర్పడుతుంది. ఏప్రిల్ 25వ తేదీన బెంగుళూరు(Bangalore)తో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. జీరో షాడో డే అనేది ఉష్ణమండలం మధ్యలో ఉన్న ప్రదేశాలలోనే సంభవిస్తుంది.