Share News

Indian Railway: రైళ్ల మీద పిడుగు పడితే జరిగేదేంటి..? ఎంత వర్షం వస్తున్నా సరే.. రైళ్లు ఎందుకు ఆగవంటే..!

ABN , First Publish Date - 2023-10-30T15:45:20+05:30 IST

ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో భారతీయ రైల్వే ఒకటి. ప్రతిరోజూ కొన్ని లక్షల మందిని రైల్వే గమ్య స్థానాలకు చేరుస్తుంటుంది. తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చనే కాకుండా, విమానం, బస్సులతో పోలిస్తే రైళ్లలో సురక్షితంగా, సౌకర్యవంతంగా జర్నీ చేయవచ్చని చాలా మంది భావిస్తుంటారు.

Indian Railway: రైళ్ల మీద పిడుగు పడితే జరిగేదేంటి..? ఎంత వర్షం వస్తున్నా సరే.. రైళ్లు ఎందుకు ఆగవంటే..!

ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో భారతీయ రైల్వే (Indian Railway) ఒకటి. ప్రతిరోజూ కొన్ని లక్షల మందిని రైల్వే గమ్య స్థానాలకు చేరుస్తుంటుంది. తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చనే కాకుండా, విమానం, బస్సులతో పోలిస్తే రైళ్లలో సురక్షితంగా, సౌకర్యవంతంగా జర్నీ చేయవచ్చని చాలా మంది భావిస్తుంటారు. రైల్వే శాఖ నివేదిక ప్రకారం భారత రైల్వే 13,523 రైళ్లను నడుపుతోంది. ఏదో ఘోర విపత్త సంభవిస్తే తప్ప రైళ్లు ఆగే ప్రసక్తే ఉండదు.

ఎంత పెద్ద వర్షం పడినా రైళ్లు ప్రయాణిస్తూనే ఉంటాయి. భారీ వరదలు సంభవించి ట్రాక్‌లు కొట్టుకుపోతే తప్ప రైళ్లు రద్దవడం అనేది ఉండదు. మరి, భారీ వర్షం (Rain) పడుతున్నప్పుడు ప్రయాణించే రైళ్లపై పిడుగులు (Lightining) పడితే ఏం జరుగుతుంది? రైలుపై పిడుగు పడితే అందులో ప్రయాణించే వారు సురక్షితమేనా? అవును.. రైలు మీద పిడుగు పడినా ఏమీ జరగదు. ఎందుకంటే.. రైలు బయటి భాగాన్ని ఇనుము (Iron), ఉక్కుతో, లోపలి భాగాన్ని చెక్కతో తయారు చేస్తారు. ఐరన్‌తో చేసిన రైలుపై పిడుగు పడినా ఎలాంటి ప్రభావమూ ఉండదు. కదులుతున్న రైలుపై పిడుగు పడినా లోపల కూర్చున్న ప్రయాణికులు పూర్తి సురక్షితంగా ఉంటారు (Unknown Facts).

Husband: నాకు అలాంటి భర్తే కావాలి.. అవి తెలిసుండాలి.. ఓ యువతి వింత ప్రకటన.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు!

కేవలం ఐరన్ మాత్రమే కాదు.. ప్రతి రైలులోనూ ఎర్తింగ్ పరికరం కూడా ఉంటుంది. ఒకవేళ రైలుపు శక్తివంతమైన పిడుగు పడినపుడు అది ఆ ఎర్తింగ్ పరికరం ద్వారా ప్రయాణించి నేరుగా నేల వైపు వెళ్లిపోతుంది. కాబట్టి, ఎంత భారీ పిడుగు పడినా ప్రయాణికులు ఆందోళన చెందనక్కర్లేదు.

Updated Date - 2023-10-30T15:47:59+05:30 IST