గ్యాంగ్ రేప్ జరిగినా కుంగిపోలేదు.. ఒకప్పుడు బార్లలో డ్యాన్సులు.. ప్రస్తుతం మిస్ వరల్డ్ టైటిల్ విన్నర్..
ABN , First Publish Date - 2023-01-04T18:16:39+05:30 IST
చాలా మంది మహిళలు నిత్యం వివిధ రకాల వేధింపులకు గురవుతుంటారు. ఈ క్రమంలో కొందరు మన జీవితం ఇంతే అని సరిపెట్టుకుని, సర్దుకుపోతుంటారు. మరికొందరు పడిలేచిన కెరటం లాగా.. తమ ఆశయ సాధన కోసం..
చాలా మంది మహిళలు నిత్యం వివిధ రకాల వేధింపులకు గురవుతుంటారు. ఈ క్రమంలో కొందరు మన జీవితం ఇంతే అని సరిపెట్టుకుని, సర్దుకుపోతుంటారు. మరికొందరు పడిలేచిన కెరటం లాగా.. తమ ఆశయ సాధన కోసం అహర్నిశలూ శ్రమించి, చివరకు అనుకున్న స్థాయికి చేరుకుంటుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళ కూడా ఈ కోవకే చెందుతుంది. గ్యాంగ్ రేప్ జరిగినా ఆమె కుంగిపోలేదు. ఒకప్పుడు బార్లలో డ్యాన్సులు చేసిన ఆమె.. ప్రస్తుతం మిస్ వరల్డ్ టైటిల్ విన్నర్‌గా (Miss World title winner) నిలిచింది. భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ (Transgender) అంతర్జాతీయ అందాల రాణిగా నిలిచిన నాజ్ జోషి (Naz Joshi) జీవిత విశేషాల్లోకి వెళితే..
ఉద్యోగం మానేయడం లేదని భార్యకు తలాక్ చెప్పిన భర్త.. ఆడవాళ్లకు జాబ్ చేసే హక్కు లేదంటూ..
ఢిల్లీకి (Delhi) చెందిన ఎగువ మధ్యతరగతి కుటుంబంలో నాజ్ జోషి జన్మించింది. నాజ్.. చూసేందుకు అబ్బాయిలా ఉన్నా.. హావభావాలు, వ్యవహార శైలి మాత్రం అమ్మాయిలా ఉండేది. కొన్నాళ్లకు పూర్తిగా అమ్మాయిలాగే ప్రవర్తిస్తుండడంతో.. తల్లిదండ్రులు ఆమెను వరుసకు మామ అయ్యే వ్యక్తి వద్ద ఉంచారు. అప్పటికి పదేళ్ల వయసున్న నాజ్.. అక్కడ చాలా వేధింపులకు (Harassment) గురైంది. ఓ రోజు నాజ్ మామ, అతడి స్నేహితులుగా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ నాజ్‌కు పరిచయమైన వ్యక్తి ద్వారా లింగమార్పిడి గురించి తెలుసుకుంది.
తర్వాత జీవనోపాధి కోసం వివిధ రకాలు పనులు చేసింది. సాయంత్రం అమ్మాయి వేషంలో బార్లలో (Dances in bars) డ్యాన్స్ చేయడం, ఉదయం అబ్బాయిలా స్కూల్‌కి హాజరవడం చేస్తుండేది. ఒక్కోసారి వీధుల్లో అడుక్కునే పరిస్థితి కూడా వచ్చింది. అయినా ఆమె ఎక్కడా కుంగిపోకుండా ధైర్యంగా ముందుకు వెళ్లింది. అనంతర కాలంలో చదువును కొనసాగిస్తూనే ష్యాషన్ డిజైనింగ్‌లో (Passion Designing) కోర్సు పూర్తి చేసింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుండి పట్టభద్రురాలు అయ్యాక, 2013లో లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుంది. తర్వాత మోడలింగ్ వృత్తిని (Modeling career) కొనసాగిస్తూ వచ్చింది. అప్పట్లో ఢిల్లీ వీధుల్లో అమ్మాయి దుస్తులు ధరించి దిగిన బోల్డ్ ఫొటోలు.. ఓ మ్యాగజైన్ కవర్ పేజీపై ప్రచురించబడ్డాయి.
మందు పార్టీ చేసుకున్న మామా, అల్లుళ్లు.. నిద్రపోయి లేచిన మామ.. ఉన్నట్టుండి తన భార్య కనపడకపోవడంతో..
అప్పటి నుంచి ఆమె అంతర్జాతీయ ట్రాన్స్‌జెండర్ అందాల రాణిగా (international transgender beauty queen) మారే వరకూ వెనుతిరిగి చూసుకోలేదు. ఇటీవల జరిగిన ఎంప్రెస్ ఎర్త్ 2021-22 టైటిల్‌ను గెలుచుకుంది. మిస్ వరల్డ్ డైవర్సిటీ బ్యూటీ పేజెంట్ టైటిల్‌ను వరుసగా 3 సార్లు గెలుచుకోవడంతో పాటూ 8 అందాల పోటీల్లో కిరీటాన్ని గెలుచుకుంది. 2016లో మిస్ యునైటెడ్ నేషన్స్ అంబాసిడర్‌గా ఉన్నప్పటి నుంచి మూడు సార్లు.. మిస్ వరల్డ్ డైవర్సిటీ టైటిల్‌ను (Miss World Diversity Title) గెలుచుకునే స్థాయికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. టైటిల్‌ను గెలుచుకోవడంపై నాజ్ మాట్లాడుతూ, కిరీటం గెలవడం.. సమాజం పట్ల తన బాధ్యతలను మరింత పెంచిందని చెప్పింది. ఇంట్లో మొదలయ్యే మార్పు.. సామాజిక మార్పును తీసుకొస్తుందని చెబుతున్న నాజ్ జోషి.. ప్రస్తుతం మహిళందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
కలుద్దామంటూ న్యూఇయర్ రోజున ప్రేయసి నుంచి ఆహ్వానం.. ఆమెను కలిసిన మరుక్షణంలోనే అతడికి ఊహించని షాక్..