black grapes are expensive: నల్ల ద్రాక్షను చూస్తే నోరూరుతోందా? ఖరీదు వింటే కంగారు పుడుతోందా? ఈ సంగతి తెలిస్తే ‘అవునా... నిజమా’ అంటూ...
ABN , First Publish Date - 2023-03-22T09:34:20+05:30 IST
black grapes are expensive: నల్ల ద్రాక్ష ఎందుకు అంత ఖరీదైనదిగా ఉంటుందనే ప్రశ్న మన మదిలో ఎప్పుడో ఒకసారైనా మెదిలే ఉంటుంది. దానికి సమాధానం(Answer) ఇప్పుడు తెలుసుకుందాం.
black grapes are expensive: నల్ల ద్రాక్ష ఎందుకు అంత ఖరీదైనదిగా ఉంటుందనే ప్రశ్న మన మదిలో ఎప్పుడో ఒకసారైనా మెదిలే ఉంటుంది. దానికి సమాధానం(Answer) ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి మొదటి కారణం నల్ల ద్రాక్షను పెంచే ప్రక్రియ సాధారణ ద్రాక్ష(Common grapes) కన్నా భిన్నంగా ఉంటుంది. నల్లద్రాక్ష ఎదగడానికి ప్రత్యేక పరిస్థితులు అవసరం. నిర్దిష్ట నేల, వాతావరణ పరిస్థితులు(weather conditions) కూడా అంతే అవసరం. పైగా పరిమిత ప్రాంతాలలోనే పండుతుంది. నల్ల ద్రాక్ష ఉత్పత్తి ఖర్చు(ఖర్చు) చాలా ఎక్కువ. నల్ల ద్రాక్ష పెంపకానికి ఉష్ణోగ్రత అధికంగా ఉండకూడదు.
దీనితోపాటు కోత తదితరాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇటువంటి పరిస్థితుల కారణంగా నల్లద్రాక్ష(black grapes) ఖరీదు పలుకుతుంది. అలాగే నల్ల ద్రాక్ష భారీ పరిమాణంలో సరఫరా అవదు. పరిమిత పరిమాణంలోనే సరఫరా అవుతుంది. టేబుల్ ఫ్రూట్(Table fruit) అని పిలిచే నల్ల ద్రాక్షకు చాలా డిమాండ్ ఉంది. నల్ల ద్రాక్షను సేకరించేటప్పుడు చేతితోనే తీయాల్సి ఉంటుంది. దీంతో పంట సేకరణకు అధిక సమయం పడుతుంది. నల్లద్రాక్ష ప్యాకింగ్(packing) కూడా చాలా భిన్నంగా చేయాల్సి ఉంటుంది. అది దాని ధర పెరుగుదలకు కూడా కారణమవుతుంది. నల్ల ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు(Antioxidants), ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
దీంతో వీటికి గిరాకీ కూడా అధికంగానే ఉంటుంది. నల్ల ద్రాక్ష కంటికి చాలా మేలు చేస్తుంది. ఇది కంటి చూపును(Eyesight) పెంచడంలో సహాయపడుతుంది. నల్ల ద్రాక్షలో పొటాషియం(Potassium) ఉంటుంది. ఫలితంగా గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. జుట్టు, చర్మానికి మేలు చేసే విటమిన్ ఇ(Vitamin E) నల్ల ద్రాక్షలో లభిస్తుంది. ఇది చర్మం మెరిసేందుకు సహాయపడుతుంది.