Viral: గులాబీ రంగు సరస్సు వెనకున్నమిస్టరీ ఏంటి? ఆ నీటికి ఆ రంగెలా వచ్చింది.. పోటెత్తుతున్న పర్యాటకులు
ABN , First Publish Date - 2023-10-08T14:28:11+05:30 IST
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎన్నో అద్భుతమైన వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. ప్రకృతిలోని వింతలు, విచిత్రాలకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ పింక్ సరస్సు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎన్నో అద్భుతమైన వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. ప్రకృతి (Nature Videos)లోని వింతలు, విచిత్రాలకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ పింక్ సరస్సు (Pink Lake) చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ సరస్సులోని నీరు పూర్తిగా గులాబీ రంగులో (Pink Water) ఉంటుంది. ఆ వింతను చూసేందుకు పర్యాటకులు తరచుగా అక్కడకు వెళుతుంటారు.
రష్యా (Russia)లోని సైబీరియాలోని ఆల్టై పర్వత ప్రాంతంలో ఈ గులాబీ రంగు సరస్సు ఉంది. ఇది ఉప్పు నీటి సరస్సు. ఈ సరస్సులోని ఉప్పు ప్రతి సంవత్సరం ఆగస్టులో గులాబీ రంగులోకి మారుతుంది. ఆర్టెమియా సలీనా అనే సూక్ష్మజీవుల కారణంగా ఆ ఉప్పు నీటి సరస్సు నీరు పింక్ రంగులోకి మారుతుంది. ఆర్టెమియా సాలినా అనేది ఉప్పునీటి రొయ్యల జాతి, ఇవి వందల సంవత్సరాలుగా ఆ సరస్సు అడుగు భాగంలో నివసిస్తున్నాయి. ఈ సైబీరియన్ పింక్ లేక్ చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది.
Viral Video: వామ్మో.. ఇంత భయంకరంగా ఉందేంటి? ఈ జీవి ఎక్కడి నుంచి వచ్చింది.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
TruongPham అనే ట్విటర్ ఖాతాలో ఈ వీడియో షేర్ అయింది. ఈ పింక్ నీటి సరస్సు గుండా వేసిన రైలు పట్టాలపై రైలు వెళుతుండడం చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఈ వైరల్ వీడియోను ఇప్పటవరకు 13 వేల మందికి పైగా వీక్షించారు. ఈ రమణీయ దృశ్యంపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``చాలా అద్బుతంగా ఉంది``, ``ఈ ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింతలు ఉన్నాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.