Wife: ఇంట్లోంచి వెళ్లిపోయి హిజ్రాను పెళ్లి చేసుకున్న భర్త.. ఆ భార్యకు అసలు నిజం తెలిసి షాక్.. చివరకు ఏం జరిగిందంటే..!

ABN , First Publish Date - 2023-07-03T14:10:32+05:30 IST

అందరమ్మాయిల్లాగే పెళ్ళయ్యాక తన భర్తతో జీవితం నందనవనం అవుతుందని ఆశ పడిందామె. కానీ..

Wife: ఇంట్లోంచి వెళ్లిపోయి హిజ్రాను పెళ్లి చేసుకున్న భర్త.. ఆ భార్యకు అసలు నిజం తెలిసి షాక్.. చివరకు ఏం జరిగిందంటే..!

భార్యా భర్తల బంధం చాలా గొప్పది. ఈ బంధంలో ఒకరు తీసుకునే నిర్ణయాలు మరొకరిని ప్రభావితం చేస్తుంటాయి. ఆ అమ్మాయికి పెళ్ళయ్యి ఏడాదే.. అందరమ్మాయిల్లాగే పెళ్ళయ్యాక తన భర్తతో జీవితం నందనవనం అవుతుందని ఆశ పడిందామె. భర్త ప్రక్కన మహారాణిలా సాగాల్సిన ఆమె జీవితం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. భర్త ఇంట్లోంచి వెళ్లిపోయి హిజ్రాను వివాహం చేసుకోవడంతో ఆమె కన్నీరుమున్నీరవుతోంది. నాలుగు నెలల గర్భవతి అయిన ఆమె ఏమి చేయాలో తెలియని సందిగ్దంలో ఘోరానికి పాల్పడింది. హృదయాలను బరువెక్కించే ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

బీహార్(Bihar) రాష్ట్రం, భోజ్ పూర్ జిల్లాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. భోజ్ పూర్ జిల్లా కనైలి గ్రామానికి చెందిన రాణి అనే యువతికి 2022లో మధుకుమార్ గుప్తా అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. పెళ్ళి జరిగిన సమయానికి అతను పాట్నాలో బస్ డ్రైవర్ గా(bus driver) పనిచేసేవాడు. ఒకసారి అతనికి యాక్సిడెంట్ అయ్యింది. ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న అతన్ని ఒక హిజ్రా హాస్పిటల్ కు తరలించింది(hijra save man). ఆమె తన సొంత చేతుల మీద 90వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని మధుకుమార్ గుప్తాకు వైద్యం చేయించింది. మధుకుమార్ కోలుకున్న తరువాత ఆమెకు డబ్బు తిరిగివ్వబోతే ఆమె తీసుకోలేదు. ' నాకు డబ్బు వద్దు, నాకు ఎవరూ లేరు, నేను చనిపోతే నాకు అంత్యక్రియలు చేయండి' అని చెప్పింది. ఆ హిజ్రా మాటలకు మధుకుమార్ మనసు చలించిపోయింది. అతను తనకు తెలియకుండానే హిజ్రాతో ప్రేమలో పడ్డాడు. కొన్నిరోజుల తరువాత మధు హిజ్రాను పెళ్ళిచేసుకున్నాడు(man marry a hijra). వీళ్ళిద్దరూ కలిసి పాట్నాలో ఓ స్వీట్ షాప్ కూడా మొదలుపెట్టారు.

Viral Video: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయయ్యా బాబూ.. సైకిల్‌ను కూడా ఎలా మార్చేశారో మీరే చూడండి..!


హిజ్రాను పెళ్ళిచేసుకున్న తరువాత మధు రాణికి దూరంగా ఉండేవాడు. రాణి 4నెలల గర్భవతి(wife 4months pregnant) అని తెలిసినా అతను ఆమెతో ఉండటానికి ఇష్టపడలేదు. పైపెచ్చు ఆమెను తిట్టడం, ఎక్కడికైనా వెళ్ళి చావు అని ఈసడించుకోవడం చేసేవాడు. ఈ క్రమంలో మధు రాణికి ఖర్చుల కోసం డబ్బు ఇవ్వడానికి ఆమె ఇంటికి వెళ్ళాడు. అతను తిరిగి వెళ్ళిపోతుండగా వెళ్ళద్దంటూ రాణి గొడవ చేసింది. ఆమె గొడవ చేయడంతో మధు ఆమె మీద చెయ్యి చేసుకున్నాడు. ఆ తరువాత నుండి రాణికి ఖర్చుల కోసం డబ్బు ఇవ్వడం కూడా మానేశాడు. హిజ్రాతోనే ఉంటానని తెగేసి చెప్పాడు. దీంతో రాణి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇరుగుపొరుగు వారు ఆమెను గుర్తించి హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు హాస్పిటల్ కు చేరుకుని ఆమెను విచారించారు. ఆమె పోలీసుల ముందు తన గోడు మొత్తం చెప్పుకుని కన్నీరు మున్నీరయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Yellow Teeth: ఎంత ప్రయత్నించినా పచ్చగా ఉన్న పళ్లు తెల్లగా మారడం లేదా..? ఇంట్లోనే తయారు చేసుకునే ఈ పేస్ట్‌ను వాడితే..!


Updated Date - 2023-07-03T14:10:32+05:30 IST