Wife: ఎంత పనిచేశావమ్మా..? ఇలాంటి వాడిని నమ్మి పెళ్లయిన 45వ రోజే.. కాపురాన్ని నాశనం చేసుకున్నావు కదా..!
ABN , First Publish Date - 2023-07-26T16:36:46+05:30 IST
భర్తతో సంతోషంగా జీవితం గడపాల్సిన ఆమె నడిరోడ్డులో అన్నపానీయాలు లేకుండా రోదిస్తోంది.
తల్లిదండ్రులు చూడచక్కని కుర్రవాడిని చూసి తమ తాహతుకు మించి ఆ అమ్మాయి పెళ్ళి చేశారు. కూతురు వేరే ఇంటికి వెళుతోందని బాధ కలిగినా భర్త దగ్గర ఎంతో సంతోషంగా ఉంటుందని ఆమెను అత్తారింటికి పంపారు. కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఆశల మీద నీళ్లు జల్లింది. పెళ్లైన 45వ రోజే తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంది. భర్తతో సంతోషంగా జీవితం గడపాల్సిన ఆమె నడిరోడ్డులో అన్నపానీయాలు లేకుండా తనకు సహాయం చేసేవారికోసం అర్థిస్తోంది. ఈమె గురించి తెలుసుకున్నవారికి ఏకకాలంలో కోపం, జాలి కలుగుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
నేటి కాలంలో ఎంత జాగ్రత్తగా పెళ్లిళ్లు చేసినా ఆ బంధాలు అంత పటిష్టంగా ఉండటం లేదు. భాగస్వాములలో ఎవరో ఒకరు తప్పటడుగులు వేయడమే దీనికి ప్రధాన కారణం. బీహార్(Bihar) రాష్ట్రం నలంద జిల్లా(Nalanda)లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. నలంద జిల్లా బెన్ ఠానా ప్రాంతానికి చెందిన ఒక గ్రామంలో అంజనీ కుమారి అనే యువతి నివసించేది. ఆమె అదే గ్రామానికి చెందిన చింటూ కుమార్ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో అంజనీకి ఇంట్లో పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో అంజనీ పెళ్లి విషయాన్ని చింటూ కుమార్ కు చెప్పింది, తనను పెళ్లి చేసుకోమని అభ్యర్థించింది. కానీ చింటూ కుమార్ ముఖం చాటేశాడు. కొన్ని రోజులలోనే అంజనీ కుమారికి మిల్కీ మహూరి గ్రామానికి చెందిన రోషన్ కుమార్ అనే కుర్రాడితో వివాహాం ఖాయమైంది. జూన్ 3న వీరిద్దరి వివాహం ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. పెళ్లి తరువాత అంజనీ తన అత్తామామల గ్రామానికి వెళ్లిపోయింది.
Fridge: ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా.. కొత్త ప్రిడ్జ్ కొనాల్సిందే.. ఫ్రిడ్జ్ పాడయిపోయిందని ఎలా గుర్తు పట్టాలంటే..!
అంజనీ అత్తారింటికి వెళ్ళిన తరువాత చింటూ కుమార్ మళ్లీ అంజనీకి కాంటాక్ట్ లోకి వచ్చాడు. అంజనీని తనెంతగానో ప్రేమిస్తున్నట్టు ఆమెను నమ్మించాడు. భర్తకు దూరంగా ఉండమని సలహా ఇచ్చాడు. ఇలా వారిద్దరూ ఫోన్ లో టచ్ లో ఉండేవారు. పెళ్ళయిపోయింది కాబట్టి ఆమె ఇల్లు వదిలి రాలేదని చింటూ కుమార్ భావించాడు. ఆ ఉద్దేశ్యంతోనే నువ్వు అత్తారింటి నుండి పారిపోయి నా దగ్గరకు వచ్చెయ్యి, మనమిద్దరం సంతోషంగా ఉందాం అని చెప్పాడు. ఆ మాటలు విని పాపం అమాయకురాలైన అంజనీ అతను నిజమే చెప్పాడనుకుంది. పెళ్ళయిన 45వ రోజే అత్తారిల్లు వదిలి పారిపోయి చింటూ ఇంటికి చేరుకుంది. అయితే ఆమె నిజంగానే వస్తోందని తెలుసుకున్న చింటూ ఇంటికి తాళం వేసుకుని సూరత్ కు పారిపోయాడు. దీంతో ఆమె అత్తారింటికి, పుట్టింటికి వెళ్లలేక చింటూ ఇంటి ముందే నిరసనకు దిగింది. పోలిస్ స్టేషన్ కు, సర్పంచ్ ఇంటికి తిరుగుతూ న్యాయం చేయమని అర్థిస్తోంది. ఆమె గత 5రోజుల నుండి అన్నపానీయాలు లేక ఒంటరిగా పోరాడుతోందని స్థానికులు చెబుతున్నారు. చింటూ కుమార్ కు ఆమెకు మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం గ్రామస్తులకు కూడా తెలిసిందేనని అంటున్నారు. కాగా మహిళ నిరసన చేపట్టిన ప్రియుడి ఇల్లు మంత్రి శ్రవణ్ కుమార్ ఇంటికి కూతవేటు దురంలో ఉండటం గమనార్హం.