Wife: భర్తకు తెలియకుండా ఆన్‌లైన్‌లో ఓ వ్యక్తితో స్నేహం.. గంటల కొద్దీ చాటింగ్.. అతడిని అతిగా నమ్మిన ఆ భార్య పరిస్థితి ఇప్పుడేంటంటే..

ABN , First Publish Date - 2023-04-09T20:41:20+05:30 IST

ఆన్లైన్ చాటింగ్ వల్లే తొందరగా స్నేహితులైపోవడం, పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం జరుగుతోంది. ఓ మహిళకు..

Wife: భర్తకు తెలియకుండా ఆన్‌లైన్‌లో ఓ వ్యక్తితో స్నేహం.. గంటల కొద్దీ చాటింగ్.. అతడిని అతిగా నమ్మిన ఆ భార్య పరిస్థితి ఇప్పుడేంటంటే..

ప్రస్తుతం కాలంలో అందరి జీవితాల్లో ఆన్లైన్ పరిచయాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఆన్లైన్ చాటింగ్ వల్లే తొందరగా స్నేహితులైపోవడం, పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం జరుగుతోంది. ఓ మహిళకు పేస్ బుక్(face book) లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని పరిచయం కాస్తా స్నేహంగా మారింది. భర్తకు తెలియకుండానే అతనితో గంటల తరబడి చాటింగ్ చేసిందామె. కానీ అతడిని అతిగా నమ్మడం వల్ల ఆమె పరిస్థితి ఇప్పుడు అయోమయంలోకి జారిపోయింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఒడిశా(odisha) రాష్ట్రం కేంద్రపరా(Kendrapara) జిల్లాకు చెందిన జమ్రున్ అనే 38ఏళ్ళ మహిళకు ఫేస్ బుక్ లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. అతను చాలా బాగా మాట్లాడటంతో ఆమె అతనితో స్నేహం చేసింది. వారిద్దరూ కొన్నిరోజుల్లోనే మంచి స్నేహితులయ్యారు(face book friends). జమ్రున్ భర్త షేక్ రజీద్ గుజరాత్(gujarat) లో ఉద్యోగం చేస్తున్నాడు. జమ్రున్ కు ఆన్లైన్ లో పరిచయం అయిన వ్యక్తి జమ్రున్ తో 'నీ భర్తకు ఉద్యోగం ఉంది. నీకు ఏం అవసరమైనా డబ్బు కోసం అతని ముందు చెయ్యి చాపాలి కదా.. ఎన్నాళ్ళు అలా చేస్తావు? నీకెప్పుడూ బాధగా అనిపించదా?' అని అన్నాడు. 'నేనేం చేయను ఇంటిపట్టున ఉండి డబ్బు సంపాదించే మార్గాలేవీ నాకు తెలియదు' అని చెప్పిందామె. ఆమె నుండి అదే సమాధానం వస్తుందని ముందే ఊహించిన అతను.. 'నువ్వు ఇంటి పట్టున ఏదైనా వర్క్ చేయకపోయినా నీకు బోలెడు డబ్బు వచ్చే ఉపాయం చెబుతాను' అన్నాడు. అదేంటో చెప్పమని ఆమె అడగడంతో '1.50లక్ష రూపాయలు నువ్వు నాకివ్వు, నీకు 25లక్షల రూపాయలు విలువైన బహుమతులు వస్తాయి. వాటిని అమ్మితే నీకు బోలెడు డబ్బు వస్తుంది' అని నమ్మబలికాడు. తనకు ఎంతో నమ్మకమైన స్నేహితుడు నిజమే చెబుతున్నాడని నమ్మి అతనికి యూపీఐ ట్రాన్సిక్షన్ ద్వారా 1.50లక్షలు పంపింది. ఆమె డబ్బు పంపిన కొన్ని రోజులకే ఫేస్ బుక్ లో అతని అకౌంట్ మాయమైంది. దీంతో తాను మోసపోయానని జమ్రున్ అర్థం చేసుకుంది.

Audi Chaiwala: అమ్మ బాబోయ్.. ఇదేం విచిత్రం.. ఆడీ కారులో టీ వ్యాపారం.. డిక్కీలో పెద్ద హోటల్‌నే పెట్టేశారుగా..!


ఆమె వెంటనే తను మోసపోయిన విషయం తన భర్తకు ఫోన్ చేసి చెప్పింది. ఆమె చెప్పింది వినగానే అతను కోపంతో రగిలిపోయాడు. కష్టపడి సంపాదించిన డబ్బు భార్య ఇలా నాశనం చేసిందని వెంటనే ఫోన్లోనే 'ట్రిపుల్ తలాక్'(triple talaq) చెప్పాడు. అతను ట్రిపుల్ తలాక్ చెప్పగానే ఆమె ఉలిక్కిపడింది. అతనికి ఏదో చెప్పబోయినా అతను వినకుండా ఫోన్ పెట్టేశాడు. ఆ తరువాత ఆమె అతన్ని కాంటాక్ట్ అవ్వాలని ప్రయత్నించినా అతను అందుబాటులోకి రాలేదు. దీంతో విసిగిపోయిన ఆమె పోలిస్ స్టేషన్ కు చేరుకుని జరిగిన విషయం పోలీసులకు చెప్పింది.' ప్రభుత్వం 2019లోనే పార్లమెంట్ సాక్షిగా ట్రిపుల్ తలాక్ రద్దు చేసింది. అలాంటిది ఇప్పుడు దాన్ని తనమీద ఎలా ప్రయోగిస్తాడు?' అంటూ భర్త మీద ఫిర్యాదు చేసింది. కాగా మహిళలకు ట్రిపుల్ తలాక్ చెప్పే పురుషులకు మూడేళ్ళ జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుందనే విషయం అందరికీ తెలిసిందే.. పోలీసులు ఆమె ఫిర్యాదు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

Viral Video: డ్రైవరన్నా.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. డ్రైవింగ్ సీట్లో కూర్చుని కదలకుండానే దొంగను ఎలా ఇరికించాడో మీరే చూడండి..!


Updated Date - 2023-04-09T20:41:20+05:30 IST