Wife: ఇలాంటి భర్త నాకొద్దు.. ఈ కుటుంబంలో నేనుండలేనంటూ విడాకుల కేసు పెట్టిందో భార్య.. ఆమె చెప్పిన కారణం తెలిస్తే..!
ABN , First Publish Date - 2023-11-27T13:08:23+05:30 IST
అత్తింటి వారు చేసిన నిర్వాకం కారణంగా ఓ భార్య కోర్డు మెట్లెక్కింది. నేను ఈ కుటుంబంలో ఉండనంటే ఉండను.. నాకు విడాకులు ఇప్పించండంటూ వేడుకుంది.
పెళ్ళిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటారు. ఎంత గొప్పగా పెళ్లిళ్లు జరుగుతున్నాయో విడాకులు కూడా అంత తొందరగా నమోదవుతున్నాయి. భార్యాభర్తలు సర్దుకుపోలేకపోవడం ఒక కారణం అయితే భార్యాభర్తల బంధంలో పెద్ద వాళ్లు జోక్యం చేసుకోవడం రెండవది. ఎన్నో ఏళ్ళు పుట్టింట్లో పెరిగిన ఆడపిల్ల అత్తింటికి వెళ్లాక ఆమెను గౌరవించడం అత్తింటివారి బాధ్యతే.. కానీ అత్తింటి వారు చేసిన నిర్వాకం కారణంగా ఓ భార్య కోర్డు మెట్లెక్కింది. నేను ఈ కుటుంబంలో ఉండనంటే ఉండను.. నాకు విడాకులు ఇప్పించండంటూ వేడుకుంది. అసలు ఆమె విడాకులు కోరడం వెనుక కారణం ఏంటి? ఆమె అత్తామామలు చేసిన పనేంటి? పూర్తీగా తెలుసుకుంటే..
మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రం భోపాల్ లో వింత సంఘటన చోటు చేసుకుంది. జహంగీరాబాద్ లో ఓ మహిళ తన భర్త, అత్తామామలతో కలసి నివాసం ఉంటోంది. ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగి కాగా, ఆమె తన అత్తగారు నడుపుతున్న షాపులో సహాయం చేసేది. అయితే ఆమెకు తన అత్తమామల నుండి వింత ఇబ్బంది మొదలైంది. ఆమె తన ఫోన్ తీసుకుని ఎవరితోనైనా ఫోన్ మాట్లాడాలంటే వారు మాట్లాడనిచ్చేవారు కాదు. ఫోన్ చేతిలోకి తీసుకోగానే ఎప్పుడూ ఆమెను తిట్టడం, ఫోన్ మాట్లాడకుండా అడ్డుకోవడం చేసేవారు. దీంతో ఆమె చాలా విసిగిపోయింది. ఈ క్రమంలోనే ఆమె తల్లికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో తల్లిని పరామర్మించడానికి ఫోన్ చేయడానికి ప్రయత్నించింది. అయితే ఫోన్ చేస్తుండటం చూసిన ఆమె అత్తగారు ఫోన్ లాగేసుకుంది. 'మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, ఆమెతో నేను మాట్లాడాలి' అని ఆ కోడలు అత్తతో చెప్పినా ఫలితం లేదు. పైపెచ్చు 'ఆమె ఇంకా బ్రతికే ఉంది, అంతగా బాధపడం మానెయ్యి' అంటూ కోడలికి హితవు చెప్పింది.
ఇది కూడా చదవండి: కూరల్లో వాడే వెల్లుల్లి వల్ల.. ఏకంగా ఇన్ని ప్రయోజనాలా..?
తల్లికి అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా అత్తగారు ఇలా చెయ్యడంతో ఆ మహిళ సహనం నశించింది. తన భర్తకు తన పరిస్థితి చెప్పినా అతను సర్ధుకుపోమని సలహా ఇచ్చాడు. దీంతో ఆమె అత్తింటి నుండి బయటకు వచ్చి వేరేచోట అద్దె ఇంట్లో మకాం పెట్టింది. ఆన్లైన్ లో తనకంటూ వ్యాపారం కూడా మొదలు పెట్టింది. తనకు తన భర్త నుండి విడాకులు ఇప్పించాలంటూ కోర్టును ఆశ్రయించింది. తన భర్త తనతో ఉండాలంటే తను అద్దెకున్న ఇంటికే రావాలంటూ డిమాండ్ చేసింది. అయితే ఈ విషయంలో ఆమె భర్త మాత్రం సుముఖంగా లేడు. ఆమె ఏం చేసినా సరే నేను నా కుటుంబాన్ని వదిలి రానంటూ తేల్చి చెప్పాడు. వీరిద్దరికి కౌన్సెలింగ్ ఇవ్వాలంటూ న్యాయమూర్తి కౌన్సిలర్లను ఏర్పాటు చేశాడు. వారిద్దరినీ రాజీ చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నించారు.