Brave Woman: సినిమాటిక్ సీన్.. ఈమె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే భయ్యా.. వైరల్ వీడియో!

ABN , First Publish Date - 2023-02-19T14:18:49+05:30 IST

నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలోని దృశ్యాలు చూస్తే.. సినిమాటిక్ సీన్‌ను తలపిస్తుంది.

Brave Woman: సినిమాటిక్ సీన్.. ఈమె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే భయ్యా.. వైరల్ వీడియో!

ఇంటర్నెట్ డెస్క్: నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలోని దృశ్యాలు చూస్తే.. సినిమాటిక్ సీన్‌ను తలపిస్తుంది. ఒంటరిగా జీమ్ చేసుకుంటున్న యువతిపై ఓ యువకుడు అఘాయిత్యానికి ప్రయత్నించడం.. దాంతో ఆమె ప్రతిఘంటించడం.. పిడిగుద్దులపై అతడిపై విరుచుకుపడడంతో అతగాడు బతుకుజీవుడా! అంటూ అక్కడి నుంచి పరుగు అందుకోవడం.. ఆ తర్వాత యువతి పోలీసులకు ఫోన్ చేయడంతో వారు గంటల వ్యవధిలోనే యువకుడిని అదుపులోకి తీసుకోవడం.. ఇలా సీన్ బై సీన్ అంతా కూడా సినిమా స్టైల్‌లోనే ఉంది. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఫ్లోరిడాలోని టెంపా బేకు చెందిన నషాలీ అల్మా (24) తన అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని జీమ్‌లో వర్కౌట్లు చేసుకుంటుంది. అంతలోనే అటువైపుగా ఓ యువకుడు వచ్చాడు. జీమ్‌లో నషాలీ ఒంటరిగా ఉండడం గమనించిన అతడు డోర్ కొట్టాడు. దాంతో నషాలీ వెళ్లి డోర్ తీసింది.

అనంతరం తన పనిలో తాను పడిపోయింది. ఇక లోపలికి వచ్చిన యువకుడు ఆమెను వెనుకవైపు నుంచి వెళ్లి పట్టుకోబోయాడు. దాంతో ఆమె అతడిని నుంచి విడిపించుకుని అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించింది. కానీ, మరోసారి ఆమెను పట్టుకుని కిందపడేశాడు. ఆ తర్వాత ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆమె అతడిపై పిడిగుద్దులతో విరుచుకుపడడంతో మనోడు అక్కడి నుంచి పరుగు అందుకున్నాడు. వెంటనే నషాలీ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు జీమ్‌లోని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఆ యువకుడిని జేవియర్ థామస్ జోన్స్ (25)గా గుర్తించారు. అనంతరం 24గంటల్లోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. జనవరి 22న జరిగిన ఈ ఘటన తాలూకు వీడియోను తాజాగా పోలీసులు విడుదల చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఎంతో ధైర్యంగా యువకుడిని ఎదుర్కొన్న నషాలీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె ధైర్యాన్ని హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఓరి బుడ్డోడా.. నీకు ధైర్యం కూసింత ఎక్కువేరోయ్.. నెటిజన్లను స్టన్ చేస్తున్న వీడియో..!

Updated Date - 2023-02-19T14:22:14+05:30 IST