Bengaluru: కారుతో హడలెత్తించిన మహిళ.. ఏం చేసిందో మీరే చూడండి
ABN , First Publish Date - 2023-01-20T18:25:19+05:30 IST
కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరులో (Bengaluru) ప్రియాంక (Priyanka) అనే ఓ మహిళ టాటా నెగ్జాన్ (TATA Nexon) కారు ర్యాష్ డ్రైవింగ్‌తో (Car rash driving) హడలెత్తించింది.
బెంగళూరు: కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరులో (Bengaluru) ప్రియాంక (Priyanka) అనే ఓ మహిళ టాటా నెగ్జాన్ (TATA Nexon) కారు ర్యాష్ డ్రైవింగ్‌తో (Car rash driving) హడలెత్తించింది. ఓవర్ టేకింగ్ సమయంలో దర్శన్ (Darshan) అనే యువకుడి మారుతీ సుజుకీ స్విఫ్ట్ (Maruti Suzuki Swift) కారును ఢీకొట్టింది. ఈ విషయమై ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వాగ్వాదం జరగడంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన ప్రియాంక తన కారు బానెట్‌పై దర్శన్‌ను దాదాపు 1 కిలోమీటరు మేర ఈడ్చుకెళ్లింది. ఈ హఠాత్ పరిణామంతో దర్శన్ భయబ్రాంతులకు గురయ్యాడు. కారు బానెట్‌పై ప్రాణభయంతో వణికిపోయాడు. దర్శన్ స్నేహితులు బైక్‌పై కారును వెంబడించి వీడియో తీశారు. బెంగళూరులోని జ్ఞాన భారతి నగర్ ఏరియాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రియాంక, దర్శన్ ఇరువురిపైనా కేసులు నమోదు చేశారు. నిర్లక్ష్యపూరిత, డ్రైవింగ్ కింద ప్రియాంకపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దర్శన్ స్నేహితులైన మరో నలుగురు యువకులపై కూడా కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు.