Wife: ఓ భార్య చెప్పుతో కొట్టబోతోంటే.. రెండో భార్య కాపాడుతోంది.. నడి రోడ్డుపై భార్యాభర్తల ఫైటింగ్.. చివరకు..!
ABN , First Publish Date - 2023-06-05T15:34:12+05:30 IST
కొన్ని దశాబ్దాల క్రితం కొందరు పురుషులు ఇద్దరేసి మహిళలను పెళ్లిళ్లు చేసుకుని సంసారాలు సాగించేవారు. అయితే క్రమేపీ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడం, అక్షరాస్యత శాతం పెరగడంతో పురుషాధిక్యత చాలా వరకు తగ్గిపోయింది.
కొన్ని దశాబ్దాల క్రితం కొందరు పురుషులు ఇద్దరేసి మహిళలను పెళ్లిళ్లు చేసుకుని సంసారాలు సాగించేవారు. అయితే క్రమేపీ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడం, అక్షరాస్యత శాతం పెరగడంతో పురుషాధిక్యత చాలా వరకు తగ్గిపోయింది. ఒక పురుషుడు రెండో వివాహం (Secong Marriage) చేసుకోవడం అనేది దాదాపు కనుమరుగైంది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరం. అయినప్పటికీ కొందరు వ్యక్తులు మాత్రం మొదటి భార్యకు తెలియకుండా మరో యువతిని వివాహం చేసుకుంటున్నారు.
అలాంటి ఘటన ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది. ఈ వీడియోలో ఇద్దరు మహిళలు తమ భర్త కోసం గొడవపడుతున్నారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ యువకుడు తన రెండో భార్యతో కలిసి రోడ్డుపై నిల్చున్నాడు. ఇంతలో మొదటి భార్య వచ్చి అతడిని చెప్పుతో కొట్టింది (Woman hits husband with slipper). వెంటనే రెండో భార్య ముందుకు వచ్చి భర్తను వెనక్కుతోసింది. తన సవతితో గొడవకు దిగింది. ఇద్దరూ రోడ్డు పైనే కొట్టుకున్నారు. చట్టు పక్కల వారు విడదీయడానికి ప్రయత్నించినా ఇద్దరూ జుట్లు పట్టుకుని ఘర్షణ పడ్డారు.
Viral Video: ఎందుకొచ్చిన కడుపుమంట తల్లీ.. ఫ్రెండ్‌తో కలిసి బైక్‌పై వెళ్తూ ఈ నిర్వాకమేంటి..? పక్కనే ఓ కుర్రాడు బైక్‌పై వెళ్తోంటే..
Prakash Kumar అనే వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటన బీహార్ (Bihar)లోని నలంద ప్రాంతంలో జరిగినట్టు తెలిపారు. ఆ వ్యక్తి తన మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడని, అందువల్లే ఆమె తన భర్తను కొట్టడానికి వచ్చిందని పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.