Share News

Uttar Pradesh: నడిరోడ్డుపై మైనర్ బాలుడిని చితక్కొట్టిన మహిళ.. కారణమేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ABN , First Publish Date - 2023-11-03T18:31:20+05:30 IST

ఆ కుర్రాడి వయసు 13 ఏళ్లు.. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌సహర్‌కు చెందిన ఆ బాలుడిని బుధవారం సాయంత్రం ఓ మహిళ చితక్కొట్టింది.. జనాలతో కిక్కిరిసిపోయిన మార్కెట్లో అందరూ చూస్తుండగా కింద పడేసి కాలితో తన్నింది.. చెప్పులతో కొట్టింది.. ఆమె ఆగ్రహానికి కారణమేంటంటే..

Uttar Pradesh: నడిరోడ్డుపై మైనర్ బాలుడిని చితక్కొట్టిన మహిళ.. కారణమేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఆ కుర్రాడి వయసు 13 ఏళ్లు.. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని బులంద్‌సహర్‌కు చెందిన ఆ బాలుడిని బుధవారం సాయంత్రం ఓ మహిళ చితక్కొట్టింది.. జనాలతో కిక్కిరిసిపోయిన మార్కెట్లో అందరూ చూస్తుండగా కింద పడేసి కాలితో తన్నింది.. చెప్పులతో కొట్టింది (Woman Hits Minor Boy).. ఆ కుర్రాడు మార్కెట్‌కు వస్తున్న అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే కారణంతో ఆ మహిళ తన ప్రతాపం చూపించింది.. స్థానికులు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral)అయింది.

బులంద్‌షహర్‌లోని రద్దీగా ఉండే అన్సారీ రోడ్ మార్కెట్‌లో ఓ మైనర్ కుర్రాడిపై మహిళ విరుచుకుపడింది. ఆ కుర్రాడు మార్కెట్‌కు వస్తున్న అమ్మాయిలను టీజ్ (Teasing Girls) చేస్తున్నాడని పేర్కొంది. ఆ కుర్రాడిపై విచక్షణా రహితంగా దాడి చేసింది. చెప్పులతోనూ, కర్రతోనూ కొట్టింది. కింద పడేసి కొట్టింది. ఆ కుర్రాడు తనను విదిలేయమని ఏడుస్తూ వేడుకుంటున్నా ఆమె కనికరించలేదు. చుట్టూ ఉన్న వారు ఆమెను అడ్డుకోకపోగా వీడియో తీస్తూ నిల్చున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Madhya Pradesh: నేను తల్లిని కావాలనుకుంటున్నా.. నా భర్తను వదలండి.. మధ్యప్రదేశ్ హైకోర్టులో ఓ మహిళ పిటీషన్!

ఆ వైరల్ వీడియోపై నెటిజన్లు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆ బాలిడిపై, ఆ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ``13 ఏళ్లకే అలాంటి పనులు నేర్చుకున్నాడా.. అతడికి శిక్ష పడాల్సిందే``, ``ఆ అబ్బాయికి కౌన్సిలింగ్ ఇస్తే సరిపోతుంది.. ఇలా చేయడం తప్పు``, ``పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందే.. ఇంత దారుణంగా కొట్టడం అవసరమా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-11-03T18:31:22+05:30 IST