Marriage: భార్యకు మళ్లీ పెళ్లి.. దగ్గరుండి మరీ చేసిన భర్త.. మూడేళ్ల క్రితమే పెళ్లయింది కానీ..!

ABN , First Publish Date - 2023-07-24T17:54:35+05:30 IST

తన మరిదితో ప్రేమలో పడిన ఓ మహిళ తన భర్త సమక్షంలోనే అతడిని ప్రేమ వివాహం చేసుకుంది. భర్తే దగ్గరుండి మరీ తన భార్యకు, ఆమె మరిదికి వివాహం జరిపించాడు. ఒడిశాలోని సోన్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Marriage: భార్యకు మళ్లీ పెళ్లి.. దగ్గరుండి మరీ చేసిన భర్త.. మూడేళ్ల క్రితమే పెళ్లయింది కానీ..!

తన మరిదితో ప్రేమలో పడిన ఓ మహిళ తన భర్త సమక్షంలోనే అతడిని ప్రేమ వివాహం చేసుకుంది (Woman marries brother-in-law). భర్తే దగ్గరుండి మరీ తన భార్యకు, ఆమె మరిదికి వివాహం జరిపించాడు. ఒడిశా (Odisha)లోని సోన్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సోన్‌పూర్ జిల్లా కిరాసి గ్రామానికి చెందిన మాధవ ప్రధాన్ అనే వ్యక్తి మూడేళ్ల క్రితం అనుగుల్ ప్రాంతానికి చెందిన జిల్లి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. మాధవ్ సోదరుడు పరమేశ్వర్ తరచుగా వారి ఇంటికి వచ్చేవాడు (Viral News).

పరమేశ్వర్ తరచుగా వస్తూ జిల్లితో మాట్లాడుతుండేవాడు. ఆ క్రమంలో ఇద్దరూ ప్రేమ (Extra Marital Affair)లో పడ్డారు. మాధవ్ లేనపుడు ఇంట్లోనే కలుసుకునేవారు. ఆ విషయం చుట్టు పక్కల వారందరికీ తెలిసిపోయింది. దీంతో జిల్లి, పరమేశ్వర్ గత గురువారం ఇంటి నుంచి పారిపోయారు. భార్య కోసం అంతా గాలించిన మాధవ్ చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని గాలించిన పోలీసులు జిల్లిని పట్టుకున్నారు. జిల్లిని, పరమేశ్వర్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లారు.

Shocking Video: తల్లి చేసిన మిస్టేక్‌తో.. కారు డోర్‌లో ఇరుక్కుపోయిన పాప తల.. చూసుకోకుండానే ఆమె దిగిపోవడంతో..!

జిల్లిని స్టేషన్‌లోనే ఉంచి స్టేషన్ అధికారి ప్రశ్నించారు. తనకు పరమేశ్వర్ అంటే చాలా ఇష్టమని, అతడినే పెళ్లి చేసుకుంటానని జిల్లి తేల్చి చెప్పింది. దీంతో పోలీసులు మాధవ్‌ను పిలిచి పరిస్థితి వివరించారు. భార్య తనకు ఇష్టమైన వ్యక్తినే వివాహం చేసుకునేందుకు మాధవ్ అంగీకరించాడు. దీంతో శనివారం రాత్రి మాధవ్ సమక్షంలోనే జిల్లికి, పరమేశ్వర్‌కు వివాహం జరిగింది.

Updated Date - 2023-07-24T17:54:35+05:30 IST