Viral Video: బ్రేస్‌లెట్ ఆర్డర్ ఇచ్చిన యువతికి దిమ్మతిరిగిపోయే షాక్.. డెలివరీ బాయ్ ఇచ్చిన పార్శిల్‌లో డబ్బా.. ఓపెన్ చేసి చూస్తే..!

ABN , First Publish Date - 2023-07-03T16:22:05+05:30 IST

ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్ అనేది చాలా మందికి ఓ అలవాటుగా మారిపోయింది. షాప్‌ల్లోకి వెళ్లి అన్నీ చూసి ఏదో ఒకటి కొనుక్కోవడం అనేది చాలా మందికి నచ్చడం మానేసింది. ఆన్‌లైన్ షాపింగ్ విపరీతంగా పెరగడానికి అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లు ఇస్తున్న ఆఫర్లు ఒక కారణం.

Viral Video: బ్రేస్‌లెట్ ఆర్డర్ ఇచ్చిన యువతికి దిమ్మతిరిగిపోయే షాక్.. డెలివరీ బాయ్ ఇచ్చిన పార్శిల్‌లో డబ్బా.. ఓపెన్ చేసి చూస్తే..!

ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్ (Online Shopping) అనేది చాలా మందికి ఓ అలవాటుగా మారిపోయింది. షాప్‌ల్లోకి వెళ్లి అన్నీ చూసి ఏదో ఒకటి కొనుక్కోవడం అనేది చాలా మందికి నచ్చడం మానేసింది. ఆన్‌లైన్ షాపింగ్ విపరీతంగా పెరగడానికి అమేజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart) వంటి ఈ-కామర్స్ సైట్లు ఇస్తున్న ఆఫర్లు ఒక కారణమైతే, ఎలాంటి మోసమూ లేకుండా నాణ్యమైన వస్తువులను చెప్పిన టైమ్‌కు డెలివరీ చేయడం మరో కారణం. అయితే అప్పుడప్పుడు మాత్రం పొరపాట్లు జరుగుతుంటాయి.

వినియోగదారుడు ఒకటి ఆర్డర్ చేస్తే, పార్శిల్‌లో మరొకటి వచ్చిన ఘటనలు అనేకం. తాజాగా ఐశ్వర్య అనే మహిళకు కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. ఐశ్వర్య అనే యువతి మీషో (Meesho) వెబ్‌సైట్‌లో సీతాకోకచిలుక ఉన్న బ్రాస్‌లెట్‌ (Bracelet)ను ఆర్డర్ చేసింది. వారం తర్వాత ఆమెకు ఓ పార్శిల్ వచ్చింది. అయితే ఆ పార్శిల్‌లో ఆమెకు ఓ ఫేస్ క్రీమ్ (Face Cream) బాక్స్ వచ్చింది. షాకైన ఐశ్వర్య ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఇతరులతో పంచుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది.

Teacher Video: ఓ టీచరమ్మకు ఇంతకుమించిన అవార్డు ఇంకేం ఉంటుంది..? రిటైర్మెంట్ రోజున స్కూల్‌లో ఏం జరిగిందో మీరే చూడండి..!

ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోకు 36 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. చాలా మంది ఆమె వీడియో చూసి నవ్వుకుంటున్నారు. మరికొందరు తమకూ అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కామెంట్లు చేశారు. తక్కువ ధరకు వస్తున్నాయని ఆర్డర్ చేసే వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని మరికొందరు సూచించారు.

Updated Date - 2023-07-03T16:22:05+05:30 IST