Viral Video: ఢిల్లీ మెట్రోలో మరో షాకింగ్ సన్నివేశం.. యువకుడి చెంప ఛెళ్లుమనిపించిన యువతి.. వీడియో వైరల్!

ABN , First Publish Date - 2023-07-04T10:29:24+05:30 IST

రకరకాల వివాదాలకు, ఆసక్తికర ఘటనలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది ఢిల్లీ మెట్రో. ఢిల్లీ మెట్రోలో జరిగన ఘటనలకు సంబంధించిన వీడియోలు కనీసం వారానికి ఒకటి అయినా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Viral Video: ఢిల్లీ మెట్రోలో మరో షాకింగ్ సన్నివేశం.. యువకుడి చెంప ఛెళ్లుమనిపించిన యువతి.. వీడియో వైరల్!

రకరకాల వివాదాలకు, ఆసక్తికర ఘటనలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది ఢిల్లీ మెట్రో (Delhi Metro). ఢిల్లీ మెట్రోలో జరిగన ఘటనలకు సంబంధించిన వీడియోలు కనీసం వారానికి ఒకటి అయినా సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతున్నాయి. డ్యాన్సులు వేయడం, వెరైటీ డ్రెస్సులతో తిరగడం, మేకప్ వేసుకోవడం వంటి పనులు చేస్తూ కొద్ది మంది ప్రయాణికులు మెట్రోను రకరకాలుగా వాడుకుంటున్నారు. తాజాగా ఢిల్లీ మెట్రోకు సంబంధించిన ఓ వివాదాస్పద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో ఢిల్లీ మెట్రో రైలులో ఓ యువతి తన పక్కన నిల్చున్న వ్యక్తితో గొడవ పడి, అతడి చెంప ఛెళ్లుమనిపించింది (Woman Slaps Man in delhi metro). తమ కళ్లెదురుగా అంత గొడవ జరుగుతున్నా అక్కడ ఉన్న ప్రయాణికులెవరూ వారి విషయంలో జోక్యం చేసుకోలేదు. జరుగుతున్నదానిని మౌనంగా చూస్తుండిపోయారు. మరికొందరైతే వారి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కనీసం ఏం జరిగిందని కూడా ఎవరూ అడగలేదు. అయితే ఆ యువతీ యువకుల మధ్య అసలు గొడవ ఎందుకు మొదలైందనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. వారిద్దరూ పరిచయస్థులేనని మాత్రం కొందరు కామెంట్లు చేశారు.

Popcorn Bill: ఇలా అయితే సినిమా థియేటర్లకు ఎలా వెళ్తాం? వైరల్ అవుతున్న పాప్‌కార్న్ బిల్.. నెటిజన్ల సెటైర్లు!

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. @gharkekalesh అనే ట్విటర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 64 వేల మంది వీక్షించారు. ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న వారి ప్రవర్తనపై చాలా మంది విస్మయం వ్యక్తం చేశారు. ``ఎవరూ కనీసం పట్టించుకోలేదు. మనం ఎలాంటి సమాజంలో నివసిస్తున్నాం`` అని ఒక వ్యక్తి కామెంట్ చేశారు.

Updated Date - 2023-07-04T10:29:24+05:30 IST